ఆస్ట్రేలియాతో జరగనున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత 15మంది సభ్యుల జట్టులో సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానె చోటు సంపాదించుకున్నాడు. 34 ఏళ్ల బ్యాటర్ గత సంవత్సరం దక్షిణాఫ్రికాతో జరిగిన కేప్ టౌన్ టెస్ట్ నుండి తక్కువ స్కోర్ల తర్వాత భారత జట్టుకు దూరంగా ఉన్నాడు.
IPL 2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న రహానే ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లలో 52.25 సగటుతో 199.04 స్ట్రైక్ రేట్‌తో 209 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీ 2022-23 క్యాంపెయిన్‌లో రైట్ హ్యాండర్ బ్యాటర్ కూడా ముంబైకి మంచి సీజన్‌ను అందించాడు. రెండు సెంచరీలతో సహా 57.63 సగటుతో 634 పరుగులు చేశాడు.
ఐపీఎల్ సీజన్‌లో రహానే మెరుగ్గా రాణిస్తున్నాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో 209 పరుగులు సాధించాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 11 సిక్సులు, 18 ఫోర్లు బాదిన రహానే, టోర్నీలో సెకండ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కూడా తన పేరిట నమోదు చేసుకున్నాడు.
ఐపీఎల్ ఫామ్ దెబ్బతో రహానేకు వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో ఆడే టీమిండియాలో చోటుదక్కింది. కాగా, తన తాజా ప్రదర్శనపై రహానే స్పందించాడు. ఓ ఆటగాడిలో ఉన్న ప్రతిభ బయటికి రావాలంటే అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.