భారత్‌లో జరుగుతున్న తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. మూడు ఓవర్లు పూర్తికాకుండానే ఐదు వికెట్లను దక్షిణాఫ్రికా కోల్పోయింది. బౌలింగ్ పరంగా టీమిండియా బౌలర్లు అర్ష్ దీప్ సింగ్, దీపక్ చహర్ మెరిశారు.
కేవలం ఒక ఓవర్ లోనే అర్ష్ దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్ వేసిన మొదటి ఓవర్లో ఒక వికెట్ మూడో ఓవర్‌లో మరో వికెట్ తీసుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ వరుసగా వికెట్లు కోల్పోతూ పెవిలియన్ దారి పట్టారు.
ఈ క్రమంలో క్వింటన్ డికాక్ 1, కెప్టెన్ బవుమా 0, రిలీ రోసౌ 0, డేవిడ్ మిల్లర్ 0, స్టబ్స్ 0 పరుగులేమీతో పెవిలియన్ చేరారు. ఇలా వరుస పెట్టి అవుటవ్వడంతో దక్షిణాఫ్రికా పవర్ ప్లే పూర్తికాకుండానే పీకలోతు కష్టాలో పడింది.
ఇలా తొమ్మిది పరుగులకే ఐదు వికెట్లు పడటంతో ఆతర్వాత దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ మార్కరామ్, పర్నీల్ ఆచీతూచీ ఆడుతున్నారు. 2.3 ఓవర్లలో 9 పరుగులకే ఐదు వికెట్లు పడిపోయిన తర్వాత వీరిద్దరూ నెమ్మదిగా ఆడుతూ పవర్ ప్లే పూర్తయ్యేటప్పటికి వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేశారు.