Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్ సమస్యకు గంభీర్ పరిష్కారం ఇదే..? ఏం చేయాలంటే?

భారత్-పాకిస్థాన్‌ల మధ్య దీర్ఘకాలిక సమస్యగా వున్న కాశ్మీర్ సమస్యకు క్రికెటర్ గౌతమ్ గంభీర్ పరిష్కారం చెప్పాడు. కాశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ వాహనంపై స్థానికులు రాళ్ల దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రిప

Webdunia
సోమవారం, 4 జూన్ 2018 (11:20 IST)
భారత్-పాకిస్థాన్‌ల మధ్య దీర్ఘకాలిక సమస్యగా వున్న కాశ్మీర్ సమస్యకు క్రికెటర్ గౌతమ్ గంభీర్ పరిష్కారం చెప్పాడు. కాశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ వాహనంపై స్థానికులు రాళ్ల దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రిపబ్లిక్‌ టీవీ అసోసియేట్‌ ఎడిటర్‌ ఆదిత్య రాజ్‌ కౌల్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. నౌహట్టాలో సీఆర్పీఎప్ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని రాళ్లదాడి చేశారు. 
 
ఒకవేళ ఆ వాహనం తలుపులు తెరిచే వుంటే పరిస్థితి ఎంత భయంకరంగా వుంటుందో ఒక్కసారి ఊహించుకోండన్నారు. కాశ్మీర్‌లోని ఏ మీడియా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను చూపించదన్నారు. దీనిపై గంభీర్ స్పందిస్తూ.. రాళ్లదాడి చేసేవారితో ఇంకా చర్చలు జరిపేందుకు అవకాశం వుందని భారత్ భావిస్తోందా అంటూ గంభీర్ ప్రశ్నించాడు. 
 
అదేవిధంగా ఒక్కసారి వాస్తవ పరిస్థితిని గ్రహించాలని, రాజకీయ మద్దతు ఇస్తే సైనిక దళాలు, సీఆర్పీఎఫ్‌ సత్తా ఏమిటో, ఫలితాలేమిటో చూపిస్తాయన్నాడు. మరో ట్వీట్‌‌లో కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించాలంటే.. ఇలా చేయాలన్నాడు. 
 
కాశ్మీర్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో రాజకీయ నాయకులు ఓ వారం పాటు ఎలాంటి రక్షణ లేకుండా వారి కుటుంబాలతో నివసించాలన్నాడు. ఆ తర్వాతే వారిని 2019 ఎన్నికల్లో పోటీచేసేందుకు అనుమతించాలని, అప్పుడే వారికి సైనిక దళాల బాధలేమిటో, అసలు కాశ్మీర్‌ అంటే ఏమిటో తెలిసివస్తుందని గంభీర్ వ్యాఖ్యానించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Operation Sindoor: 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం.. ఆపరేషన్ ఆగదు

Pawan Kalyan: ప్రధాని మోదీని అనికేత్ అని వర్ణించిన పవన్ కల్యాణ్..

Lahore: లాహోర్‌లో శక్తివంతమైన పేలుళ్లు- భద్రత కట్టుదిట్టం

Balochistan: బలూచిస్తాన్‌లో 14మంది పాకిస్థాన్ సైనికులు మృతి.. బాధ్యత వహించిన బీఎల్ఏ (video)

Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

వరుస సినిమాలు సిద్ధమవుతున్న డ్రింకర్ సాయి ఫేమ్ హీరో ధర్మ

తర్వాతి కథనం
Show comments