Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్: దాయాదుల పోరుకు దావూద్‌ గ్యాంగ్‌..? ఇమ్రాన్ ఖాన్ కూడా..

ఆసియా కప్‌లో హై ఓల్టేజ్‌ సమరానికి అంతా సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్‌, పాకిస్థాన్‌ మధ్య బుధవారం మ్యాచ్‌ జరగనుంది. రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడంతో ద్వైపాక్షిక సిరీస్‌లు లేని వేళ.. దాదాప

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (11:18 IST)
ఆసియా కప్‌లో హై ఓల్టేజ్‌ సమరానికి అంతా సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్‌, పాకిస్థాన్‌ మధ్య బుధవారం మ్యాచ్‌ జరగనుంది. రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడంతో ద్వైపాక్షిక సిరీస్‌లు లేని వేళ.. దాదాపు 15 నెలల తర్వాత ఇరు జట్లూ తలపడనున్నాయి. అన్ని గ్రూప్‌ మ్యాచ్‌లకెల్లా ఆసక్తిని రేపే పోరు ఇదేకావడంతో అందరి దృష్టీ దీనిపైనే ఉంది. ఇప్పటికే టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోగా బ్రాడ్‌కాస్టర్లకు కూడా కాసులపరంగా పండగే.
 
ఇకపోతే, భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌ వస్తోందా..? అంటే.. అవుననే అనుమానం వ్యక్తం చేస్తోంది అంతర్జాతీయ ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీ. దావూద్‌కు అత్యంత సన్నిహితులైన ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్‌ ఈ మ్యాచ్‌కు టిక్కెట్లు బుక్‌ చేసుకున్నట్లు ఇంటెలిజెన్స్‌ గ్లోబల్‌ నెట్‌వర్క్‌ అధికారి ఒకరు వెల్లడించారు. 
 
దావూద్‌ కుటుంబ సభ్యుల్లో కొందరు ముంబై, కరాచీల నుంచి దుబాయ్‌కు చేరుకున్నారట. దీంతో ఆరు దేశాలకు చెందిన ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు అప్రమత్తమైనట్టు తెలిసింది. భారత్‌, పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌లపై దావూద్‌ భారీగా బెట్టింగ్‌కు పాల్పడతాడన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌పై ఇంటెలిజెన్స్‌ వర్గాలు దృష్టి సారించాయి.
 
మరోవైపు, ఆసియా కప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ హాజరుకానున్నట్టు ఆ దేశ మీడియా తెలిపింది. పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ అయిన ఇమ్రాన్‌.. పీసీబీ పాట్రన్‌-ఇన్‌- చీఫ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సౌదీ అరేబియా, యూఏఈ పర్యటనలో ఉన్న ఇమ్రాన్‌.. దాయాదుల ఫైట్‌కు హాజరవుతాయని పాక్‌ దౌత్యవర్గాలు వెల్లడించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments