Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీమంత ఎమ్మెల్యేల్లో జగన్ నంబర్ 5...

దేశంలో శ్రీమంతులైన ఎమ్మెల్యేలుగా దక్షిణభారతానికి చెందిన ఎమ్మెల్యేలు నిలిచారు. ఇందులో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఐదో స్థానంలోనిలిస్తే కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి 14వ స్థానంలో నిలిచారు.

శ్రీమంత ఎమ్మెల్యేల్లో జగన్ నంబర్ 5...
, మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (13:00 IST)
దేశంలో శ్రీమంతులైన ఎమ్మెల్యేలుగా దక్షిణభారతానికి చెందిన ఎమ్మెల్యేలు నిలిచారు. ఇందులో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఐదో స్థానంలోనిలిస్తే కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి 14వ స్థానంలో నిలిచారు. 
 
ఇక తెలంగాణ రాష్ట్రంలోని మర్రి జనార్థన్ (నాగర్ కర్నూల్), జీవీ ఆంజనేయులు (వినుకొండ), ఫైళ్ళ శేఖర్ రెడ్డి (భువనగిరి)లు వరుసగా 8, 14, 19 స్థానాల్లో నిలిచారు. వీరంతా వ్యక్తిగత ఆదాయంలో దేశంలోనే టాప్ 20 జాబితాలో చోటుదక్కించుకున్నారు.
 
దేశవ్యాప్తంగా 3,145 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు గత ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించిన అసోయేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) ఈ వివరాలను వెల్లడించింది. 
 
దేశంలో ఎమ్మెల్యేల సగటు ఆదాయం రూ.24.59 లక్షల (ఉమ్మడిగా రూ.773.48 కోట్లు) మేర ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. దక్షిణాదికి చెందిన 711 మంది సభ్యుల సగటు వార్షికాదాయం రూ.51.99 లక్షలుగా ఉంది. 
 
ఈశాన్యంలోని 614 మంది ఎమ్మెల్యేల వార్షికాదాయం కేవలం రూ.8.53 లక్షలు. ఆలిండియా టాప్‌ 20లో తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఐదుగురు ఉన్నారు. ఓవరాల్‌గా ఐదో స్థానంలో వైఎస్‌ జగన్‌, ఎనిమిదో స్థానంలో మర్రి జనార్థన్‌ ఉన్నారు. 
 
దేశం మొత్తమ్మీద అత్యల్ప ఆదాయం ఉన్న ఎమ్మెల్యే కూడా ఏపీకి చెందినవారే. శింగనమల ఎమ్మెల్యే యామినీ బాల. ఈమె వార్షికాదాయం రూ.1301 మాత్రమే. అలాగే, దేశం మొత్తంమ్మీద తొలి స్థానంలో కర్ణాటక ఎమ్మెల్యేలు తొలి స్థానంలో ఉంటే.. రెండో స్థానంలో మహరాష్ట్ర ఎమ్మెల్యేలున్నారు.
 
* 711 మంది దక్షిణాది ఎమ్మెల్యేల సగటు వార్షిక ఆదాయం రూ.51.99 లక్షలు 
 
* అగ్రస్థానంలో ఉన్న కర్ణాటకలోని 204 మంది ఎమ్మెల్యేల వార్షిక సగటు ఆదాయం రూ.1.11 కోట్లు. 
 
* రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్ర ఎమ్మెల్యేల సగటు వార్షిక ఆదాయం రూ.43.4 లక్షలు.
 
* 614 మంది ఈశాన్య రాష్ట్రాల ఎమ్మెల్యేల సగటు వార్షికాదాయం కేవలం రూ.8.53 లక్షలు 
 
* 63 మంది ఛత్తీస్‌గడ్‌ ఎమ్మెల్యేల వార్షికాదాయం అత్యల్పంగా రూ.5.4 లక్షలు మాత్రమే
 
* దేశం మొత్తమ్మీద ఎమ్మెల్యేల్లో 25 శాతం మంది వ్యాపారులమని, మరో 24 శాతం మంది రైతులమని తమ అఫిడవిట్లలో పేర్కొన్నారు. 
 
* ఎమ్మెల్యేల్లో 25-50 ఏళ్ల మధ్య 1,402 మంది, 51-80 లోపు 1,727 మంది, 82-90 మధ్య 11 మంది, ఆపై వయసువారు ఇద్దరు ఉన్నారు. 
 
* ఏపీలోని 139 ఎమ్మెల్యేల వార్షిక వ్యక్తిగత ఉమ్మడి ఆదాయం రూ.53.61 కోట్లు. సగటు ఆదాయం రూ.38.56 లక్షలు.
 
* తెలంగాణలోని 94 మంది ఎమ్మెల్యేల ఉమ్మడి వ్యక్తిగత ఆదాయం రూ.26.27 కోట్లు. సగటు ఆదాయం రూ.27.94 లక్షలుగా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో సెన్సేష‌న‌ల్ హీరో న‌టిస్తున్నాడా..?