Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆసియా కప్ : భారత్‌కు ముచ్చెమటలు పోయించిన హాంకాంగ్

ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా, పటిష్టమైన భారత క్రికెట్ జట్టుకు క్రికెట్ పసికూన హాంకాంగ్ ముచ్చెమటలు పోయించింది. హాంకాంగ్‌పై టీమిండియా విరుచుకుపడుతుందనుకుంటే.. కష్టపడి నెగ్గింది.

ఆసియా కప్ : భారత్‌కు ముచ్చెమటలు పోయించిన హాంకాంగ్
, బుధవారం, 19 సెప్టెంబరు 2018 (10:14 IST)
ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా, పటిష్టమైన భారత క్రికెట్ జట్టుకు క్రికెట్ పసికూన హాంకాంగ్ ముచ్చెమటలు పోయించింది. హాంకాంగ్‌పై టీమిండియా విరుచుకుపడుతుందనుకుంటే.. కష్టపడి నెగ్గింది. భారత్‌ను భారీ స్కోరు చేయకుండా నిలువరించిన పసికూన.. ఛేదనలోనూ వణికించింది. ధవన్‌ శతకంతోపాటు రాయుడు అర్థ సెంచరీతో చెలరేగడంతో భారత్‌ 285/7 చేయగా కడదాకా పోరాడిన హాంకాంగ్‌ 259/8 స్కోరు చేసింది. రెండు ఓటములతో హాంకాంగ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత ఇన్నింగ్స్‌లో ధవన్‌ బ్యాటింగ్‌ హైలైట్‌. తొలి పవర్‌ ప్లే నుంచే రోహిత్‌ శర్మ (23), ధవన్‌ ధాటిగా ఆడారు. రోహిత్‌ను క్యాచ్‌ అవుట్‌ చేసిన ఎహ్‌సాన్‌ ఖాన్‌ (2/65) బౌలింగ్‌లో మొదటి వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ తర్వాత రాయుడు (70 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 60), దినేష్‌ కార్తీక్‌ (33), కేదార్‌ జాదవ్‌ (28 నాటౌట్‌), భువనేశ్వర్‌ (9)లు రాణించారు. ఫలితంగా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరగులు చేసింది.
 
అనంతరం ఛేదనలో హాంకాంగ్‌ ఓవర్లన్నీ ఆడి 259/8 స్కోరు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్‌ నిజాకత్‌ ఖాన్‌ (92), అన్షుమన్‌ రథ్‌ (73) అర్థ శతకాలు చేశారు. అరంగేట్రం పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ (3/48), చాహల్‌ (3/46) చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఒక దశలో భారత్‌ 300 పరుగుల స్కోరు చేసేలా కనిపించినా.. మిడిలార్డర్‌ వైఫల్యం దెబ్బ తీసింది. చివరి 10 ఓవర్లలో 48 పరుగులిచ్చిన హాంకాంగ్‌ బౌలర్లు 5 వికెట్లు కూల్చి టీమిండియా స్కోరుకు పగ్గాలేశారు. కించిత్‌ షా (3/39)కు మూడు వికెట్లు దక్కాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆసియా కప్ టోర్నీ : నేడు భారత్ తొలి మ్యాచ్