Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ జట్టులోకి 'చహర్ బ్రదర్స్'

Webdunia
సోమవారం, 22 జులై 2019 (10:05 IST)
గతంలో భారత క్రికెట్ జట్టుకి ఎంపికై అన్నదమ్ములు ఉన్నారు. వీరంతా అమితంగా రాణించి జట్టుకు ఎన్నో విజయాలు అందించారు కూడా. అలాంటివారిలో సీనియర్ క్రికెటర్ మొహిందర్ అమర్ నాథ్-సురీందర్ అమర్ నాథ్, యూసుఫ్ పఠాన్-ఇర్ఫాన్ పఠాన్, హార్దిక్ పాండ్య-కృనాల్‌లు ఉన్నారు. తాజాగా చహర్ బ్రదర్స్ ఎంపికయ్యారు.
 
ఈ నెల 23వ తేదీ నుంచి భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఇందుకోసం ఎంపిక చేసిన జట్టులో చహర్ అన్నదమ్ములు చోటుదక్కించుకున్నారు. కరీబియన్లతో టీ20 సిరీస్ ఆడే భారత జట్టుకు దీపక్ చహర్, రాహుల్ చహర్ ఎంపికయ్యారు. దీపక్ చహర్ మీడియం పేసర్ కాగా, రాహుల్ చహర్ లెగ్ స్పిన్నర్. వీరిలో రాహుల్ చహర్ ఇంకా టీనేజ్ కుర్రాడే. 
 
ఇటీవల స్వదేశంలో ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల్లో రాహుల్ ముంబై ఇండియన్స్ తరపున ప్రాతినిథ్యం వహించగా, తన అద్భుతమైన లెగ్ స్పిన్‌తో 13 వికెట్లు సాధించాడు. ఇక దీపక్ చహర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన తొలి రంజీ మ్యాచ్‌లోనే 5 వికెట్లకుపైగా సాధించి అబ్బురపరిచాడు. ఈసారి చహర్ సోదరులు టీమిండియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments