సూపర్ సిరీస్ టోర్నీలో పీవీ సింధు ఓటమి

Webdunia
ఆదివారం, 21 జులై 2019 (17:01 IST)
ఇండోనేషియా సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఓటమిపాలైంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ టైటిల్‌ పోరులో సింధుపై 15-21, 16-21 తేడాతో నాలుగో సీడ్‌, జపాన్‌ షట్లర్‌ అకానె యమగూచి విజయం సాధించింది. 
 
ఈ మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన యమగూచి వరుస గేముల్లో ఆధిపత్యం చెలాయించి సింధును చిత్తుచేసింది. రెండు గేముల్లో ఆఖర్లో పాయింట్లు సాధించిన యమగూచి సింధుపై ఒత్తిడి పెంచి ఆధిక్యం సాధించింది. 
 
కాగా, ఈ సీజన్‌లో సూపర్‌ సిరీస్‌ ఫైనల్లో సింధు ప్రవేశించడం ఇదే తొలిసారి. 2019లో ఓ అంతర్జాతీయ టోర్నీలో తొలి టైటిల్‌ సాధించాలనుకున్న సింధు కల నెరవేరలేదు. 
 
ముఖ్యంగా, సెమీస్‌లో ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌ చెన్‌ యుఫీని వరుస గేముల్లో చిత్తు చేసిన సింధు.. ఫైనల్లో ఈజీగానే గెలుస్తుందని అనుకున్నారంతా!. ఆద్యంతం ఏక‌ప‌క్షంగా సాగిన తుదిపోరులో జ‌పాన్ అమ్మాయి టైటిల్ నెగ్గింది. దీంతో ఆమె రన్నరప్‍గా నిలవాల్సివచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

తర్వాతి కథనం
Show comments