Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోని దరిదాపుల్లోకి కూడా రాలేరు.. మహీని పక్కనబెడతారా?: ఆశిష్ నెహ్రా

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (18:16 IST)
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని విండీస్‌తో జరగబోయే ట్వంటీ-20 సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం వివాదంగా మారిన నేపథ్యంలో.. భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ధోనికి అండగా నిలిచారు. ధోని ఫామ్ గురించి క్రికెట్ అభిమానులు ఆందోళన చెందవద్దని... ఆస్ట్రేలియా పర్యటనలో మళ్లీ ఆయన పామ్ లోకి వస్తారని నెహ్రా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 
 
అయితే ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సీరిస్‌కు ధోనికి ఎంపికచేయక పోవడాన్ని నెహ్రా తప్పుబట్టారు. యువ క్రికెటర్ రిషబ్ పంత్ కోసం అనుభవజ్ఞుడైన ధోనిని పక్కనబెట్టడం సరికాదని తెలిపారు. టీ20 జట్టులో రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌లు బాగానే ఆడుతున్నారు. కానీ వారెప్పుడూ ధోనీతో సమానం కాదని ఆశిష్ నెహ్రా వ్యాఖ్యానించాడు. వాళ్లిద్దరూ ధోనీకి దరిదాపుల్లోకి కూడా చేరుకోలేరని వ్యాఖ్యానించాడు. 
 
యువ ఆటగాళ్లకు ధోనీ విలువైన సలహాలు, సూచనలు ఇస్తుంటారని తెలిపాడు. మరీ ముఖ్యంగా కెప్టెన్ కోహ్లికి జట్టు సారథ్య బాధ్యతలు నిర్వర్తించడంలో ధోని సాయపడుతున్నాడని ఆశిష్ నెహ్రా వివరించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

తర్వాతి కథనం
Show comments