Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లోకి రానున్న వీవీఎస్ లక్ష్మణ్.. ఆ పార్టీలో చేరుతారా?

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (22:14 IST)
భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. జాతీయ పార్టీ బీజేపీలో ఆయన చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే లక్ష్మణ్‌తో బీజేపీ జాతీయ నేతలు చర్చలు జరిపినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వీవీఎస్ లక్ష్మణ్ బీజేపీలో చేరికకు కేంద్ర హోమంత్రి అమిత్‌ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
 
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ, క్రికెట్ ఫ్యాన్స్ అంతా అభిమానించే లక్ష్మణ్‌ను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించిందట. బీజేపీలో చేరేందుకు లక్ష్మణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో లక్ష్మణ్ బీజేపీ కండువా కప్పుకోబోతున్నారని పార్టీ వర్గాలంటున్నాయి.
 
లక్ష్మణ్ చేరికపై త్వరలోనే బీజేపీ అధికారిక ప్రకటన చేయనుందట. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఓ నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారని తెలుస్తోంది. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు లక్ష్మణ్ వీడ్కోలు పలికారు. ఆ తర్వాత ఐపీఎల్ ఫ్రాంఛైజీ డెక్కన్ ఛార్జర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్‌గా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీకేను సీఎం చేయాలంటూ మతపెద్ద సలహా... కామెంట్స్ చేయొద్దన్న డీకే

ఏదిపడితే అది మాట్లాడకుండా నా నోటికి చంద్రబాబు ప్లాస్టర్ వేశారు : అయ్యన్నపాత్రుడు

రామథ్ కుంగిపోయింది.. అయోధ్యలో భక్తుల ఇక్కట్లు అన్నీఇన్నీకావు రామయ్య!!

టీమిండియా విజయపరంపర కొనసాగాలని ఆకాంక్ష : ప్రధాని మోడీ

సరికొత్త చరిత్రను సృష్టించిన టీమిండియా : బాబు - పవన్ శుభాకాంక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

తర్వాతి కథనం
Show comments