Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాష్ట్ర ప్రయోజనాల విషయాల్లో బీజేపీ నేతలు రాజీ పడొద్దు

రాష్ట్ర ప్రయోజనాల విషయాల్లో బీజేపీ నేతలు రాజీ పడొద్దు
విజ‌య‌వాడ‌ , బుధవారం, 27 అక్టోబరు 2021 (10:50 IST)
రాష్ట్ర ప్రయోజనాల విషయాల్లో బీజేపీ నేతలు రాజీ పడొద్దని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. బద్వేలులో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్, విప్ కొరముట్ల  శ్రీనివాసులు, ఎం ఎల్ ఏ మేరుగ నాగార్జున, పులి సునీల్ కుమార్ లతో కలసి మీడియా సమావేశంలో పాల్గొన్న చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఈ సూచ‌న చేశారు. 
 
 
విమర్శలు చేసే సమయంలో బీజేపీ నేత సోము వీర్రాజు ఆలోచన చేయాలన్నారు. ఎదురుదాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేయవద్దు అన్నారు. మాకు రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంలో ఏ ఒక్కరూ చెప్పినా కూడా మేం సిద్ధంగా ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు మీద సోము  వీర్రాజు ఎందుకు మాట్లాడటం లేదు. పోలవరం విషయంలో కేంద్రం నిధులు ఇవ్వకపోయినా మేం కష్టపడి పూర్తి చేస్తున్నాం. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వడం లేదు. రూ.20 వేల కోట్లకే పరిమితం చేశారు. ఇంకా రూ.3 వేల కోట్లు ఇవ్వాలి. ఇది కేంద్రం బాధ్యత కాదా? తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చిన సోము వీర్రాజుకు బాధ్యత లేదా? అని  చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. 

 
తమ‌ అభ్యర్థి దాసరి సుధా విద్యావంతురాలు, డాక్టర్‌ కూడా అని, తనకు సమస్యలపై పూర్తి అవగాహన ఉంద‌ని చెప్పారు. ఈ ప్రాంత వాసి, బీజేపీ వారు పెట్టిన అభ్యర్థి పక్క ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి... ఎవరికి ఈ ప్రాంతంపై అవగాహన ఉంటుందో మీరే చెప్పాలి అన్నారు. ఈ విషయాలపై చర్చించేందుకు మీ అభ్యర్థిని తీసుకురండి..మేం కూడా సిద్ధంగా ఉన్నాం అని స‌వాలు చేశారు. బీజేపీ నాయకులు నియోజకవర్గంలో మాట్లాడిన మాటలపై కట్టుబడి ఉండాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సామాన్యుడిని పెళ్లి చేసుకున్న జపాన్ యువరాణి