Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ రనౌట్.. సాక్షి తలకొట్టుకుంటే.. బుడ్డోడు ఇలా ఏడ్చాడు.. (వీడియో)

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (15:53 IST)
న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ కప్ సెమీ ఫైనల్ పోరులో భారత్ పరాజయం పాలైంది. ప్రపంచకప్‌ నుంచి అనూహ్యంగా నిష్క్రమించిన టీమిండియా నిష్క్రమించింది. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లండ్‌లో ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నారు. 
 
బుధవారం కివీస్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత జట్టు, స్టాఫ్‌ తిరిగి స్వదేశానికి రాడానికి టికెట్లు సర్దుబాటు చేయడంలో బీసీసీఐ విఫలమైంది. దీంతో ఆదివారం వరకూ కోహ్లీసేన మాంచెస్టర్‌లోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది.
 
టీమిండియా ఆటగాళ్లలో కొందరు ఆటగాళ్లు ఇండియాకు వస్తారని.. మిగిలిన వారు రెండు వారాల విహారయాత్రకు అనంతరం భారత్ చేరుకుంటారని, భారత్ వచ్చేవారి కోసం టిక్కెట్లు సర్దుబాటు చేస్తున్నామని బీసీసీఐ వెల్లడించింది. 
 
ఈ నేపథ్యంలో కివీస్ నిర్ధేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్ చివరి వరకు పోరాడి 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఓపెనర్లు, టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు అవుట్ కావడంతో.. కష్టాల్లో వున్న టీమిండియాను గట్టెక్కించేందుకు ధోనీ మల్లాగుల్లాలు పడ్డాడు. జడేజాకు గట్టి భాగస్వామ్యం అందించాడు. నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. 
 
అయితే కీలక సమయంలో ధోనీ రనౌట్ అయ్యాడు. ధోనీ వికెట్ కోల్పోవడాన్ని క్రికెట్ ఫ్యాన్స్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. ధోనీ అవుటయ్యేటప్పుడు మైదానంలో వున్న ధోనీ సతీమణి సాక్షి, మహీ ఫ్యాన్స్ కన్నీటిపర్యంతం అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Heart broken... Still crying

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments