Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్‌లో నేడు ఇంగ్లండ్ - శ్రీలంక పోరు - ఇంగ్లండ్ బ్యాటింగ్

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2023 (16:05 IST)
భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా గురువారం ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు సెమీస్ ఆశలు దాదాపుగా ఆవిరైపోతాయి. 
 
ప్రపంచ కప్ మెగా టోర్నీలో ఇరు జట్లూ నాలుగేసి మ్యాచ్‌లు ఆడి, మూడు మ్యాచ్‌లలో ఓడిపోయాయి. ఇపుడీ రెండు జట్లూ అమీతుమీ తేల్చుకున్నాయి. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని గట్టిపట్టుదలతో ఉన్నాయి. 
 
సహజంగానే, భారీ స్కోరు సాధించాలనుకుంటున్న ఇంగ్లండ్‌కు శ్రీలంక స్పిన్నర్లు అడ్డంకిగా పరిణమించే అవకాశం ఉంది. బెయిర్ స్టోర్, డేవిడ్ మలాన్, జో రూట్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్ వంటి హేమాహేమీ బ్యాట్స‌మెన్లు ఉన్నప్పటికీ ఈ ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ తడబడుతుంది. 
 
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టులోకి మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, లియామ్ లివింగ్ స్టన్‌లను తీసుకున్నారు. పేసర్ రీస్ టాప్‌లే చేతి వేలు విరగడంతో స్వదేశానికి వెళ్లిపోయారు. పేసర్ గస్ ఆట్కిన్సన్, యువబ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్‌లను పక్కనబెట్టారు. అలాగే, శ్రీలంక జట్టులో సీనియర్ ఆల్‌రౌండర్ ఏజెంట్‌లో మాథ్యూస్‌కు చోటుకల్పించడం సానుకూలాంశం. పేసర్ లహిరు కుమారు కూడా ఈ మ్యాచ్‌లో ఆడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ పీసీసీ రేసులో చాలామంది వున్నారే.. ఎవరికి పట్టం?

అంగన్‌వాడీ టీచర్‌ నుంచి శాసన సభ్యురాలిగా ఎదిగిన శిరీష.. స్టోరీ ఏంటి?

పిఠాపురంలో 3.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన పవన్

ఢిల్లీ - వారణాసి వందే భారత్‌ రైలులో నీటి లీకేజీ... Video Viral

‘నా 40వ పుట్టినరోజు వరకూ నేను ఉండకపోవచ్చు’ అని స్వామి వివేకానంద ఎందుకన్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

తర్వాతి కథనం
Show comments