Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంగ్లండ్‌తో మ్యాచ్.. గాయంతో హార్దిక్ పాండ్యా డౌటే..

Advertiesment
Hardik Pandya
, బుధవారం, 25 అక్టోబరు 2023 (14:15 IST)
ఐసీసీ ప్రపంచ క్రికెట్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. వన్డే ర్యాంకింగ్స్ జాబితాలో భారత్ అగ్రస్థానంలో వుంది. తాజాగా ఇంగ్లండ్‌తో భారత్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా దూరం కానున్నట్లు తెలుస్తోంది. 
 
బంగ్లాదేశ్‌-భారత్‌ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా చీలమండకు గాయం కావడంతో హార్దిక్ పాండ్యా కివీస్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. ఈ గాయం నుంచి హార్దిక్ ఇంకా పూర్తి కోలుకోలేదని తెలుస్తోంది. 
 
ఫలితంగా వచ్చే ఆదివారం (అక్టోబర్ 29) భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే మ్యాచ్‌కు హార్దిక్ అందుబాటులో వుండబోయేది లేదని తెలుస్తోంది. అయితే నవంబర్ 2, నవంబర్ 5 తేదీల్లో జరిగే మ్యాచ్‌లకు హార్దిక్ అందుబాటులోకి వచ్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కెప్టెన్‌గా బాబర్ పనికిరాడు, ప్రతిరోజూ 8 కిలోల మటన్ మెక్కుతున్నారు, పీకెయ్యండి