Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓడినా రికార్డు నెలకొల్పిన క్రిస్ వోక్స్ ... తొలి సెంచరీ హీరో 'రూట్‌'

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (10:15 IST)
ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీలు మే 30వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో భాగంగా, ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో ఒక్క ఆటగాడు కూడా సెంచరీ నమోదు చేయలేదు. అలాగే, ఒకే మ్యాచ్‌లో ఏ ఒక్క ఆటగాడు కూడా రెండుకు మించిన క్యాచ్‌లు పట్టలేదు. కానీ, ఈ రెండింటిని ఇంగ్లండ్ ఆటగాళ్లు సాధించారు. 
 
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ అద్భుతమైన సెంచరీ బాదాడు. వరుసగా వికెట్లు కోల్పోయిన తరపుణంలో బ్యాటింగ్‌కు దిగిన రూట్.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ సెంచరీ కొట్టాడు. మొత్తం 104 బంతులను ఎదుర్కొన్న రూట్... 107 పరుగులు చేశాడు. ఫలితంగా 2019 ప్రపంచ కప్ పోటీల్లో తొలి సెంచరీ సాధించిన క్రికెట్ హీరోగా తన పేరును లిఖించుకున్నాడు. 
 
ఇదే మ్యాచ్‌లో మరో ఆటగాడు జోస్ బట్లర్ కూడా 76 బంతుల్లో సెంచరీ చేసి రెండో ఆటగాడిగా రికార్డు పుటలకెక్కాడు. ఇదిలావుంటే, 2015 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ తొలి సెంచరీ చేశాడు. 102 బంతుల్లో ఈ శతకం సాధించాడు.
 
మరోవైపు, ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ వోక్స్ ఈ మ్యాచ్‌లో ఓ రికార్దు నెలకొల్పాడు. వరల్డ్‌కప్ ఒకే మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు అందుకున్న నాలుగో ఫీల్డర్‌గా అరుదైన ఘనత సాధించాడు.
 
గతంలో భారత ఆటగాడు మహ్మద్ కైఫ్.. 2003లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో, పాక్ ఆటగాడు ఉమర్ అక్మల్ 2015లో ఐర్లాండ్‌పై, బంగ్లా ఆటగాడు సౌమ్య సర్కార్.. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు సాధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

APSRTC: మేలో 2వేల బస్సులు కావాలి.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..

రెండు సిమ్ కార్డులు ఉపయోగిస్తున్నారా? కస్టమర్లకు శుభవార్త చెప్పిన ట్రాయ్

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం : ఏపీకి పొంచివున్న భారీ వర్షాలు

'పుష్ప-2' సినిమా చూశాడు... బస్సును హైజాక్ చేసిన దొంగ.. (Video)

నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్.. టెన్షన్ టెన్షన్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకుడు శంకర్‌తో మా జర్నీ అలా మొదలైంది : నిర్మాత దిల్ రాజు

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

తర్వాతి కథనం
Show comments