Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌కు పంచ్ పడింది.. ఆతిథ్య దేశాన్ని చిత్తు చేసిన పాకిస్థాన్

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (10:06 IST)
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య దేశమైన ఇంగ్లండ్‌కు పంచ్ పడింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ విజృంభించి ఆడటంతో ఇంగ్లండ్ ఓటమిని చవిచూడాల్సివచ్చింది. 
 
నిజానికి పాకిస్థాన్ ఈ వరల్డ్ కప్ టోర్నీలో తన తొలి మ్యాచ్‌ను వెస్టిండీస్ జట్టుతో ఆడింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. 150 పరుగులు కూడా చేయలేక చతికిలపడింది. దీంతో నలువైపులా విమర్శలు పాలైంది. 
 
ఈ ఘోర అవమాన ఓటమి నుంచి తేరుకోక ముందే ఆతిథ్య ఇంగ్లండ్‌తో పాకిస్థాన్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు అంచనాలకు భిన్నంగా ఆడారు. ఫలితంగా ఇంగ్లండ్ జట్టు షాకింగ్ ఓటమిని చవిచూసింది. 
 
నాటింగ్ హామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు టాస్ ఓడి బ్యాటింగ్‌ చేపట్టింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికట్ల నష్టానికి 348 పరుగులు చేసింది. ఆ జట్టులో హఫీజ్ 84, అజామ్ 63, సర్ఫరాజ్ 55 చొప్పున పరుగులు చేయడంతో పాక్ జట్టు భారీ స్కోరు చేసింది. 
 
ఆ తర్వాత భారీ లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన ఇంగ్ండ్ జట్టు.... 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 334 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 14 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లండ్ ఆటగాళ్లళో రూట్ (107) - బట్లర్ (103)లు సెంచరీలతో కదం తొక్కినప్పటికీ జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేక పోయారు. ఫలితంగా వరల్డ్ ఫేవరేట్‌గా ఉన్న ఇంగ్లండ్‌కు పాకిస్థాన్ రూపంలో పంచ్ పడింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం