Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంజీ ట్రోఫీలో సరికొత్త రికార్డు.. జార్ఖండ్ మెరిసింది.. (Video)

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (18:36 IST)
రంజీ ట్రోఫీలో సరికొత్త రికార్డు నమోదైంది. రంజీలో జార్ఖండ్ చరిత్ర సృష్టించింది. ఫాలో ఆన్ ఆడి ప్రత్యర్ధిని ఓడించిన జట్టుగా చరిత్రలో నిలిచింది. త్రిపురతో జరిగిన మ్యాచ్ లో ఈ ఘనత సాధించింది జార్ఖండ్ జట్టు.

వివరాల్లోకి వెళితే ఈ మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన త్రిపుర జట్టులో కెప్టెన్ మిలింద్ హర్మీత్ సింగ్ అర్ధ సెంచరీలు చేయడంతో తొలి ఇన్నింగ్స్ లో ఆ జట్టు 298 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఝార్ఖండ్ జట్టుకి… త్రిపుర బౌలర్లు చుక్కలు చూపించారు. 
 
త్రిపుర బౌలర్లలో రానా… 42 పరుగులు ఇచ్చి 4 వికెట్లు… అభిజిత్ 43 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టడంతో 136 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. దీనితో 153 పరుగుల ఆధిక్యంలో ఉన్న త్రిపుర… జార్ఖండ్‌ను ఫాలో ఆన్ ఆడించింది. 
 
ఇందులో భాగంగా కెప్టెన్ సౌరభ్ తివారి… 129 పరుగులతో… ఇషాంక్‌ జగ్గీ 107 పరుగులతో చెరొక సెంచరి చేయడంతో 8 వికెట్ల నష్టానికి 418 పరుగుల భారీ స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన త్రిపుర జట్టుకి జార్ఖండ్ కోలుకోలేని షాక్‌లు ఇచ్చింది. 
 
జార్ఖండ్ బౌలర్లలో ఆశిష్ కుమార్ 67 పరుగులకే ఆరు వికెట్లు తీసి చెలరేగడంతో 49 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది త్రిపుర. ఆ తర్వాత మణిశంకర్ 103 పరుగులతో జట్టుని గట్టెక్కించే బాధ్యత తీసుకున్నా జట్టు ఓటమి తప్పలేదు. ఫాలో ఆన్ ఆడుతూ కూడా ఊహించని స్కోర్ చేసిన జార్ఖండ్ జట్టు 54 పరుగుల తేడాతో త్రిపురపై విజయం సాధించింది. ఇంకా రంజీల్లో ఫాలో ఆన్ ఆడి గెలిచిన తొలి  జట్టుగా రికార్డు సృష్టించింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్లీజ్.. చైనా అమ్మాయిలతో శారీరక సంబంధం వద్దు : అమెరికా

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం.. ఆ బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పేషీ!! (Video)

వలస విధానం మరింత కఠినతరం : హెచ్1బీ వీసాదారులకు హెచ్చరిక

తెలంగాణాలో రాగల రెండు రోజుల వడగండ్ల వానలు

మధ్యప్రదేశ్‌లో విషాదం : బావిలోని విషవాయువులకు 8 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

తర్వాతి కథనం
Show comments