గంగూలీని ఆటపట్టించిన కుమార్తె సానా.. మీ నుంచే నేర్చుకుంటున్నా..!

మంగళవారం, 26 నవంబరు 2019 (12:36 IST)
బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీని ఆయన కుమార్తె సానా గంగూలీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆటపట్టించింది. పింక్‌ బాల్‌ టెస్టులో భాగంగా సౌరవ్‌ గంగూలీ, కూతురు సానా గంగూలీల మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది.

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి ట్రోఫీ అందించేటప్పుడు దిగిన ఓ చిత్రాన్ని గంగూలీ ఇన్‌స్టాలో పంచుకున్నారు. అందులో గంగూలీ కాస్త సీరియస్‌ లుక్‌లో కనిపించడంతో.. ఆయన కుమార్తె సనా సరదాగా ట్రోల్‌ చేసింది. 'మీకు నచ్చనిది ఏంటి?' అని అడిగింది. 
 
దీనికి గంగూలీ ఫన్నీగా రిప్లే ఇచ్చాడు. ''నువ్వు.. నాపై అవిధేయత చూపిస్తున్నావా'' అని గంగూలీ బదులిచ్చాడు. మళ్లీ దానికి సనా మరో కామెంట్‌ యాడ్‌ చేశారు. ''అది మీ నుంచే నేర్చుకుంటున్నా'' అంటూ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్‌ చేసింది. ఇన్‌స్టాలో తండ్రీకూతుళ్ల ఈ సరదా సంభాషణ అందరినీ ఆకట్టుకుంటోంది. 
 
ఇకపోతే.. భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య చారిత్రక డే అండ్ నైట్‌ టెస్టు విజయవంతంగా ముగిసింది. ఈ టెస్టును బీసీసీఐ, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం విజయవంతంగా నిర్వహించాయి. పిచ్‌ను దగ్గర నుంచి ట్రోఫీ ప్రదానోత్సవం వరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్ని బాధ్యతలు తీసుకుని విజయవంతం చేశారు. అతిథులను కూడా గౌరవించారు. ఈ పోరులో భారత్‌ ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
 
అలాగే విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వరుసగా ఏడో టెస్టు విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌తో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను కూడా వైట్‌వాష్‌ చేసింది. తాజాగా బంగ్లాదేశ్‌పై కూడా రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. మరోవైపు వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ విజయాలతో సరికొత్త రికార్డును కూడా నెలకొల్పింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అంతర్జాతీయ మ్యాచ్‌లో ధోనీ.. ఎప్పుడో తెలుసా?