Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : న్యూయార్క్ సన్నాహక మ్యాచ్‌లో భద్రతా లోపం!!

ఠాగూర్
ఆదివారం, 2 జూన్ 2024 (09:55 IST)
ఐసీసీ టీ20 ప్రపం చకప్ టోర్నీలో భాగంగా న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య సన్నహాక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ సాగుతుండగా నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. మ్యాచ్ మధ్యలో భద్రతా ఉల్లంఘన నమోదైంది. 
 
భారత్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ అభిమాని ఒకరు మైదానంలోకి దూసుకొచ్చాడు. అమాంతం వచ్చి తన అభిమాన క్రికెటర్ హిట్ మ్యాన్‌న్ను హత్తుకున్నాడు. కానీ ఈ సీన్‌ను చూసిన అక్కడి భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. రెప్పపాటులోనే ఇద్దరు పోలీసు అధికారులు మైదానంలోకి పరిగెత్తుకెళ్లారు. 
 
దగ్గరకు వచ్చిన అభిమానిని తమదైన స్టైల్లో కిందపడేసి.. నేలకు అదిమిపట్టి అదుపులోకి తీసుకున్నాడు. అయితే ఈ దృశ్యాన్ని దగ్గర నుంచి చూసిన కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త కంగారుపడ్డాడు. అభిమాని విషయంలో కఠినంగా వ్యవహరించొద్దంటూ పోలీసులకు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 
 
మరోవైపు, ఈ వార్మప్ మ్యాచ్‌లో భారత్ 60 పరుగుల తేడాతో విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ సన్నాహక మ్యాచ్‌లో భారత్ చేతిలో బంగ్లాదేశ్ చిత్తుగా ఓడిపోయింది. అమెరికా, వెస్టిండీస్ జట్లు ఆతిథ్యమిచ్చే ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా, భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య శనివారం నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ వార్మప్ మ్యాచ్ జరిగింది. ఇందులో 60 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. రిషబ్ పంత్ 32 బంతుల్లో 53 పరుగులు, హార్దిక్ పాండ్యా అజేయ 40 పరుగులతో రాణించారు. అయితే లక్ష్య ఛేదనలో బంగ్లా బ్యాటర్లు విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 60 పరుగుల తేడాతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. 
 
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2 కీలకమైన వికెట్లు తీశారు. ఇక ఆల్ రౌండర్ శివమ్ దూబే కూడా బౌలింగ్లో మెరిశాడు. 2 కీలకమైన వికెట్లు తీయడమే కాకుండా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇతర బౌలర్లలో జస్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హార్థిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. జూన్ 5న ఐర్లాండ్ తొలి మ్యాచ్ ఆడడానికి ముందు సాధించిన ఈ విజయం ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్.. ఆమెకే ఈ పరిస్థితి అంటే?

ఉప్పొంగిన గోదావరి- కృష్ణానదులు.. భద్రాచలం వద్ద మొదటి వరద హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

తర్వాతి కథనం
Show comments