Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీ20 ప్రపంచ కప్‌లో భారత్ చాలా రిస్క్ చేస్తుంది : ఆసీస్ మాజీ కెప్టెన్

Michael Clarke

ఠాగూర్

, శుక్రవారం, 31 మే 2024 (11:23 IST)
టీ20 ప్రపంచకప్ సంగ్రామం కోసం భారత జట్టు సిద్ధమవుతోంది. జూన్ 5వ తేదీన తొలి మ్యాచ్‌ ఆడనుంది. 15 మందితో కూడిన స్క్వాడ్‌లో నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసుకుంది. ఇందులో ఇద్దరు స్పిన్‌ ఆల్‌రౌండర్లు కాగా.. మరో ఇద్దరు స్పెషలిస్టులు. అయితే, ఇలా తీసుకోవడం రిస్క్‌ చేసినట్లేనని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్‌ అభిప్రాయపడుతున్నాడు. రెండోసారి విజేతగా నిలుద్దామనే ఆస్ట్రేలియా ఆశలకు భారత్ నుంచి ముప్పు తప్పదని హెచ్చరించాడు.
 
'భారత్ తన జట్టును ప్రకటించడంతోనే రిస్క్‌కు సిద్ధమైంది. స్పిన్‌నే ఎక్కువగా నమ్ముకుంది. ఆసీస్‌కు భిన్నంగా ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. కరీబియన్‌ పరిస్థితుల్లో స్పిన్‌ను ఎదుర్కోవడంపైనే భారత జట్టు విజయాలు ఆధారపడి ఉంటాయి. వరల్డ్‌ కప్‌ను నెగ్గాలనే జట్లకు టీమ్‌ఇండియానే పెద్ద ముప్పు. ఈసారి ఎవరు ఫేవరెట్‌ అని చెప్పేందుకు కాస్త కష్టంగానే ఉంది. టీమ్‌ఇండియా అందులో ఒకటని చెప్పగలను. ఇప్పటివరకు ఆ జట్టు పొట్టి ఫార్మాట్‌లో చాలా క్రికెట్ ఆడింది. మిగతా టీమ్‌లతో పోలిస్తే వారి సన్నద్ధత బాగుంది. విండీస్‌, భారత్‌ మధ్య పరిస్థితులు భిన్నంగా ఉండొచ్చేమో కానీ.. కొన్ని పోలికలూ ఉన్నాయి. అవి తప్పకుండా భారత క్రికెటర్లకు ఉపయోగకరంగా మారతాయి' అని క్లార్క్‌ తెలిపాడు.
 
భారత క్రికెట్ జట్టు ఇప్పటికే న్యూయార్క్‌ వేదికగా టీ20 ప్రపంచ కప్ సన్నాహాలను ప్రారంభించింది. ఇక్కడ సరైన సదుపాయాలు కల్పించలేదని వార్తలు వస్తున్నాయి. పిచ్‌ల నుంచి వసతుల వరకూ ఏవీ కూడా సరిగ్గా లేవనేది క్రికెటర్ల అభిప్రాయమని క్రీడా వర్గాలు తెలిపాయి. ఇటువంటి వార్తలపై ఐసీసీ స్పందించింది. 'ప్రాక్టీస్‌ సదుపాయాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరి నుంచి ఫిర్యాదులు అందలేదు. ఫెసిలిటీస్‌ గురించి ఆందోళన తమ వద్దకు రాలేదు' అని ఐసీసీ స్పందించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంబటి రాయుడుకి బెదిరింపు.. ఆర్సీబీ ఫ్యాన్స్ చేసినవేనా?