Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మర్ కారులో ఆ ఇద్దరితో తుర్రుమన్న మహేంద్ర సింగ్ ధోనీ

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (16:46 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ''హమ్మర్'' అనే లగ్జరీ కారులో చక్కర్లు కొట్టాడు. భారత క్రికెటర్లు కేదార్ జాదవ్, రిషబ్ పంత్‌లను హమ్మర్ కారులో ఎక్కించుకుని వెళ్లిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా కెప్టెన్ ధోనీకి కార్లు, బైకులంటే పిచ్చి. తాజాగా ధోనీ హమ్మర్ డ్రైవింగ్ ప్రస్తుతం ఆయన ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. 
 
ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రెండు టీ-20 సిరీస్ ఆడేసింది. మరో ఐదు వన్డేల్లో ఆస్ట్రేలియా ఆడనుంది. ఇప్పటికే ట్వంటీ-20 సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. వన్డే సిరీస్‌లో భాగంగా ఇప్పటికే జరిగిన రెండు వన్డేల్లో భారత్ విజయభేరి మోగించింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌ను గెలుపొందడం ద్వారా అంతర్జాతీయ వేదికపై 500 వన్డే మ్యాచ్‌లను నెగ్గిన భారత జట్టుగా టీమిండియా అవతరించింది. 
 
ఇదే రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 116 పరుగులతో అదరగొట్టిన కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో 40వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే తమిళ క్రికటర్ విజయ్ శంకర్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి.. ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌కు బంతి విసిరి.. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ చివరి క్షణాల్లో ఒత్తిడికి లోనుకాకుండా రెండు వికెట్లు కూలగొట్టి టీమిండియాకు విజయాన్ని నమోదు చేయించాడు.
 
ఇకపోతే.. భారత్- ఆస్ట్రేలియాల మధ్య మూడో వన్డే మ్యాచ్ జార్ఖండ్‌, రాంచీలోని స్టేడియంలో జరుగనుంది. శుక్రవారం జరుగనున్న ఈ మ్యాచ్ కోసం భారత క్రికెటర్లు రాంచీకి చేరుకున్నారు. ఆ సమయంలో జార్ఖండ్ తన సొంతూరు కావడంతో ధోనీ ఎయిర్ పోర్ట్ నుంచి తన సొంత హమ్మర్ కారును తెప్పించుకున్నాడు. ఆ లగ్జరీ కారులో కేదార్, రిషబ్ పంత్‌లను ఎక్కించుకుని తుర్రుమన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments