Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాయ్ గయ్స్ హౌ ఆర్ యు.. ఆ రహస్యం బయటపెట్టేసిన ధోనీ (video)

Webdunia
సోమవారం, 20 మే 2019 (16:15 IST)
ఎస్.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ రహస్యాన్ని బయటపెట్టేశాడు. తాజాగా సోషల్ మీడియాలో ధోనీ ఓ వీడియోను పోస్టు చేస్తూ తనకు సంబంధించిన ఓ రహస్యాన్ని వెల్లడించాడు. ఆ రహస్యాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. తాను ఓ చిన్నారినని.. త్వరలో చిత్రకారుడిగా ఎదుగుతానని ధోనీ తెలిపాడు.  
 
క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతూనే.. తాను పెయింటింగ్ చేయడం మొదలెట్టానని ధోనీ చెప్పాడు. ఇలా ఇప్పటికే కొన్ని పెయింటింగ్స్ చేశానని.. ఇలా పెయింటింగ్స్‌ చేస్తూ తన కెరీర్‌ను ముందుకు సాగించాలనుకుంటున్నానని తెలిపాడు. త్వరలో ఆర్ట్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయనున్నానని.. ఆ ఎగ్జిబిషన్‌లో తన పెయింటింగ్స్ కూడా వుంటాయని తెలిపాడు. 
 
ఈ వీడియోలో ధోనీ తాను పెయింట్ చేసిన చిత్రాలను వరుసగా చూపెట్టాడు. ఇంకా ఆ పెయింటింగ్స్ అందరికీ నచ్చుతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో మొదటిసారిగా బ్యూటీఫుల్ ల్యాండ్ స్కేప్‌ను పెయింట్ చేశానన్నాడు. ఇంకా ఫ్యూచర్ ఫ్లైన్‌ను గీశానని.. ఇక బ్యాటు, బాలుతో తనకు ఫేవరెట్ అయిన క్రికెట్‌కు సంబంధించిన బొమ్మను గీశానని చెప్పుకొచ్చాడు. 
 
క్రికెట్ బొమ్మను గీసేందుకు ఎక్కువ సమయం తీసుకున్నానని.. తాను గీసిన ఈ పెయింటింగ్స్‌ను ఎగ్జిబిషన్‌లో పెట్టేందుకు ఆర్టిస్ట్స్ కమ్యూనిటీ ముందుకు రావాలని పిలుపునిచ్చాడు. ఇందుకు కాస్త సమయం తీసుకోవచ్చునని ధోనీ వెల్లడించాడు. ఈ పెయింటింగ్స్‌ను ఆదరిస్తానని, లైక్ చేస్తారని భావిస్తున్నట్లు ధోనీ తెలిపాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments