Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐడియాల గురువు ధోనీ...? ప్యాడి ఆప్టన్ ఏమన్నారు... (video)

ఐడియాల గురువు ధోనీ...? ప్యాడి ఆప్టన్ ఏమన్నారు... (video)
, గురువారం, 16 మే 2019 (13:48 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఈయన వన్డే జట్టుకు సారథ్యం వహించే సమయంలో మాజీ కోచ్ ప్యాడీ అప్ట‌న్ సైకాలజీ కోచ్‌గా ఉన్నారు. ఆటగాళ్ళ మానసిక పరిస్థితిని అంచనా వేయడంలో ఆప్టన్ మంచి దిట్ట. అయితే, టెస్టు జ‌ట్టుకు అనిల్ కుంబ్లే, వ‌న్డే జ‌ట్టుకు ధోనీ కెప్టెన్లుగా ఉన్న రోజుల్లో జరిగిన ఓ విషయాన్ని ప్యాడీ అప్ట‌న్ తాజాగా వెల్లలడించారు. 
 
ఒకవేళ ప్లేయ‌ర్లు ట్రైనింగ్ కోసం కానీ, జట్టు స‌మావేశాల‌కుకానీ ఆల‌స్యంగా వ‌స్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై చర్చించారు. అప్పుడు టెస్టు కెప్టెన్ అనిల్ కుంబ్లే ఓ సూచ‌న చేశాడు. ఆల‌స్యంగా వ‌చ్చే ప్లేయ‌ర్‌కు 10 వేల రూపాయ‌ల జ‌రిమానా విధించాల‌న్నాడు. ఈ ప్ర‌తిపాద‌న‌ను ప్లేయ‌ర్లు అంగీక‌రించిన‌ట్లు ప్యాడీ అప్ట‌న్ చెప్పారు. 
 
ఇక వ‌న్డే టీమ్ విష‌యానికి వ‌స్తే, ఏం చేయాల‌న్న ప్ర‌శ్నలు కూడా ఉత్పన్నమయ్యాయి. జట్టు సమావేశాలకు ఆటగాళ్లలో ఎవ‌రైనా ఒకరు ఆలస్యంగా వస్తే ప్ర‌తి ఆటగాడు రూ.10 వేల అపరాధం విధించాలని ధోనీ సూచించారు. ధోనీ ఇచ్చిన ఈ ఐడియా ఎంతగానో ఉపయోగపడింది. పైగా, ధోనీ ఐడియా తర్వాత క్క ఆటగాడు కూడా జట్టు సమావేశాలకు ఆల‌స్యంగా రావడం లేదా డుమ్మా కొట్టలేదని ప్యాడీ గుర్తుచేశారు.
 
ముఖ్యంగా, జట్టు విజయాల్లో ధోనీ ఐడియా బాగా వర్కౌట్ అయిందని ప్యాడీ చెప్పుకొచ్చారు. మ్యాచ్ ఎంత ఉత్కంఠంగా సాగుతున్నా.. ధోనీ చాలా మ‌నోనిబ్బ‌రంతో ఆట‌ను ఆడుతాడ‌ని, అదే అత‌ని శ‌క్తి అని చెప్పాడు. మిగితా ప్లేయ‌ర్లు కూడా కూల్‌గా ఉండేలా చేస్తాడ‌న్నాడు. కోల్‌క‌తాలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ప్యాడీ పాల్గొని ఈ విషయాలను వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీకి ఏదైనా జరిగితే.. అందుకే దినేష్ కార్తీక్‌ను ఎంపిక : విరాట్ కోహ్లీ(Video)