Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ జట్టులో కరోనా కలకలం - నెట్ బౌలర్‌కు కోవిడ్ పాజిటివ్

Webdunia
ఆదివారం, 8 మే 2022 (15:11 IST)
స్వదేశంలో ఐపీఎల్ 15వ సీజన్ పోటీలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, ఈ సీజన్‌లోని ఫ్రాంచైజీల్లో ఒకటైన ఢిల్లీ జట్టులో కరోనా కలకలం చెలరేగింది. ఈ జట్టుకు చెందిన నెట్ బౌలర్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ బౌలర్‌ను ఐసోలేషన్‌కు తరలించారు. అంతేకాకుండా, మిగిలిన ఆటగాళ్లు కూడా తమతమ హోటల్ గదులకే పరిమితం కావాలని ఆదేశించారు. దీంతో నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం రాత్రి 7.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందా లేదా అనే విషయంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. 
 
ఇదిలావుంటే, ఆదివారం ఉదయం ఢిల్లీ ఆటగాళ్లు అందరి నమూనాలను మరోసారి పరీక్షకు పంపించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫలితాల తర్వాత మ్యాచ్‌పై స్పష్టత వస్తుందని పేర్కొన్నాయి. ఢిల్లీ జట్టులో కరోనా కేసులు వెలుగు చూడడం ఇదే మొదటిసారి కాదు. 
 
గతంలో ఫిజియో ప్యాట్రిక్ ఫార్ హార్ట్, ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్, టిమ్ సీఫెర్ట్ సహా ఆరుగురికి కరోనా సోకింది. దీంతో వీరిని ఐసోలేషన్‌కు వెళ్లి వచ్చారు. నేటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్కేకు 11వది అవుతుంది. ఇప్పటికే ఐదు విజయాలు సాధించిన ఢిల్లీకి ఇకపై ప్రతీ మ్యాచ్ కీలకం కానుంది. టెస్ట్ ఫలితాల తర్వాత నెగెటివ్ వచ్చిన వారిని మ్యాచ్‌కు అనుమతించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ

సాయుధ దళాల్లో పని చేసే జంట వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య

ఐవీఎఫ్‌కి తండ్రి.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన కమలా హారిస్

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్

చట్టం ఇకపై గుడ్డిది కాదు : న్యాయ దేవతకు కొత్త రూపు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

తర్వాతి కథనం
Show comments