Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిఖర్ ధావన్ - ఆయేషా ముఖర్జీలకు విడాకులు మంజూరు

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2023 (17:53 IST)
భారత క్రికెటర్ శిఖర్ ధావన్, ఆయన సతీమణి ఆయేషా ముఖర్జీలకు ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ కేసులో ప్రాథమికంగా భార్య క్రూర ప్రవర్తన కారణంగానే వారికి విడాకులు మంజూరు చేస్తున్నట్టు కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. కాగా, తన భార్య ఆయేషా ముఖర్జీ, తాను విడిపోతున్నట్టు గత రెండేళ్ల క్రితం శిఖర్ ధావన్ ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
ఈ క్రమంలోనే తన భార్య మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ.. ధావన్ ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పిటిషన్‌పై పలు దఫాలుగా విచారణ జరిపిన కుటుంబ న్యాయస్థానం.. వీరికి విడాకులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా భార్య ఆయేషా ముఖర్జీపై ధావన్ చేసిన ఆరోపణలను కోర్టు సమర్థించింది. ఈ ఆరోపణలు నిజం కావని ఆయేషా రుజువు చేసుకోలేకపోయినట్లు పేర్కొంది.
 
'తన ఒక్కగానొక్క కుమారుడికి దూరంగా ఉండాలని ధావన్‌న్ను అతడి భార్య మానసికంగా వేధించినట్లు కోర్టు గుర్తించింది. ఆయేషా తొలుత శిఖర్ ధావన్‌తో కలిసి భారత్‌లో ఉండేందుకు అంగీకరించింది. కానీ, తన మొదటి భర్తతో కలిగిన సంతానాన్ని చూసుకునేందుకు ఆస్ట్రేలియాలోనే ఉండిపోయింది. దీంతో ధావన్ తన కుమారుడికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇక ధావన్ తన సొంత డబ్బుతో ఆస్ట్రేలియాలో కొనుగోలు చేసిన మూడు ఆస్తులపై తనకు యాజమాన్య హక్కులు కల్పించాలని ఆమె ఒత్తిడి చేసినట్లు కోర్టు నిర్ధారణకు వచ్చింది. ఒక ఆస్తిలో 99శాతం వాటా, మిగతా రెండు ఆస్తుల్లో సహ యాజమాన్యం కావాలని ఆమె డిమాండ్ చేసినట్లు ధావన్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ ఆరోపణలను ఆమె వ్యతిరేకించలేదు. అందువల్ల ఇవన్నీ వాస్తవమేనని కోర్టు గుర్తించింది' అని న్యాయస్థానం తమ తీర్పు సందర్భంగా వెల్లడించింది.
 
అంతేగాక, శిఖర్ ధావన్ పరువుకు భంగం కలిగించేలా ఆయేషా ఉద్దేశపూర్వకంగా తోటి క్రికెటర్లు, బీసీసీఐ, ఐపీఎల్ జట్టు యాజమాన్యానికి తప్పుడు సందేశాలు పంపించినట్లు విచారణలో తేలింది. తన మొదటి భర్తతో కలిగిన ఇద్దరు కుమార్తెల ఫీజులు, ఇతరత్రా ఖర్చుల కోసం కూడా ధావన్ నుంచి ఆమె డబ్బులు డిమాండ్ చేసినట్లు కోర్టు గుర్తించింది. ధావన్ చేసిన ఆరోపణలన్నీ నిజమని తేలడంతో కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. 
 
కాగా, ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ ఆయేషా ముఖర్జీని ధావన్ 2012లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడున్నారు. అయితే, వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2020 నుంచి దూరంగా ఉంటున్నారు. ధావన్ నుంచి తాను విడిపోతున్నట్లు 2021లో ఆయేషా ఇన్‌స్టా వేదికగా ప్రకటించింది. ఆమెకు అంతకు ముందే పెళ్లి అయి భర్త నుంచి విడిపోయింది. మొదటి భర్త ద్వారా ఆమెకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. వీరి బాగోగులు కూడా శిఖర్ ధావనే చూస్తూ వచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

తర్వాతి కథనం
Show comments