Webdunia - Bharat's app for daily news and videos

Install App

షమీ భార్య రాజకీయాల్లోకి వచ్చేశారు.. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు..

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ రాజకీయ అరంగేట్రం చేశారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (12:22 IST)
భారత క్రికెటర్‌, పేసర్ మొహమ్మద్‌ షమీపై ఆయన భార్య హసీన్ జహాన్ చేసిన వేధింపుల వార్తల గురించి తెలిసిందే. తనను తన భర్త వేధిస్తున్నాడని చెప్పే హసీన్ జహాన్ గురించి తెలియని నిజాలు చాలానే ఉన్నాయి. హసీన్ ఫిర్యాదుతో షమీపై గృహహింస చట్టం కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.


అలాగే షమీ కూడా హసీన్ తనను మోసం చేసి పెళ్లి చేసుకుందని ఆరోపించాడు. తొలి పెళ్లి గురించి ఆమె దాచేసిందని.. ఆపై తనను వివాహం చేసుకుందని షమీ విమర్శించాడు. 
 
ఈ నేపథ్యంలో టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ రాజకీయ అరంగేట్రం చేశారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముంబై నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వృత్తి రీత్యా జహాన్ మోడల్ అన్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో కూడా అవకాశాలు దక్కించుకునే పనిలో ఆమె ప్రస్తుతం ఉన్నారు.
 
మరోవైపు, షమీతో జహాన్‌కు విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. షమీతో పాటు అతని కుటుంబసభ్యులు తనను శారీరకంగా హింసించారని, అసభ్యంగా ప్రవర్తించారని ఆమె పోలీస్ కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో షమీ బీసీసీఐ కాంట్రాక్టును కూడా కోల్పోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు షమీని బీసీసీఐ జట్టులోకి తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తర్వాతి కథనం
Show comments