Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెలవు ఇవ్వలేదనే జడ్జి భార్య - కొడుకుపై కాల్పులు జరిపా... సెక్యూరిటీగార్డు

సెలవు ఇవ్వలేదనే జడ్జి భార్య - కొడుకుపై కాల్పులు జరిపా... సెక్యూరిటీగార్డు
, మంగళవారం, 16 అక్టోబరు 2018 (19:19 IST)
ఢిల్లీ నగర శివారు ప్రాంతమైన గురుగ్రామ్‌లో అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి క్రిష్ణకాంత్ భార్య, కొడుకును ఓ కానిస్టేబుల్ కాల్చిన కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెను చూసి రావడానికి జడ్జి సెలవు ఇవ్వకపోవడం వల్లే మహిపాల్ సింగ్ అనే ఆ కానిస్టేబుల్ ఈ దారుణానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది.
 
సదరు జడ్జి సెలవు ఇవ్వకపోగా షాపింగ్‌కు వెళ్తున్న తన భార్య, కొడుకుకు ఎస్కార్ట్‌గా వెళ్లాలని ఆదేశించడంతో అతని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గురుగ్రామ్ మార్కెట్‌లో పట్టపగలే ఆ ఇద్దరిపై మహిపాల్ సింగ్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో జడ్జి భార్య అక్కడికక్కడే చనిపోగా కుమారుడు మాత్రం తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను కూడా బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లోకేష్‌కు అక్క అయితే ఇలాగే సర్దుబాటు చేస్తారా?: పవన్ ప్రశ్న