Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జలంధరుని భార్య పాతివ్రత్యాన్ని చెడగొట్టిన శ్రీ మహావిష్ణువు... ఎందుకు?

Advertiesment
జలంధరుని భార్య పాతివ్రత్యాన్ని చెడగొట్టిన శ్రీ మహావిష్ణువు... ఎందుకు?
, సోమవారం, 15 అక్టోబరు 2018 (19:28 IST)
తులసి చెట్టు వద్ద సంధ్యా సమయం దీపం పేట్టేవారు వైకుంఠాన్ని పొందుతారు. అంతేకాదు తులసి పెరట్లో వుంటే ఆ ఇంట్లో అష్టైశ్వరాలు లభిస్తాయి. అలాంటి తులసీ వనమాలిగా మారిన కథ తెలుసుకుందాం.
 
శివపురాణంలో జలంధరుని పుట్టుక గురించిన కథను గురించి తెలుసుకుంటే వనమాలి కథ గురించి తెలుస్తుంది. శివుని కోపాజ్ఞి నుండి పుట్టినవాడు జలంధరుడు. ఇంద్రుణ్ణి శిక్షించడానికి దావాగ్నిని శివుడు గంగా సాగరంలో దాచిపెట్టాడు. ఆ అగ్ని బాలుని రూపం ధరించగా సముద్రుడు ఆ బాలుడిని బ్రహ్మకు అప్పగించాడు. ఆ బాలుడికి పేరు పెట్టడానికి బ్రహ్మ దగ్గరకు తీసుకోగానే కంటి నుండి నీరు వచ్చిందట. అప్పుడు బ్రహ్మ స్వయంగా ఆ బాలుడికి జలంధరుడు అని పేరుపెట్టాడు. 
 
శివుడు తప్ప మరెవర్వరు ఇతణ్ణి చంపలేరని వరమిచ్చాడు. శుక్రుని శిక్షణలో జలంధరుడు రాక్షస రాజు అయ్యాడు. క్షీర సాగర మథనంలో దేవతలు రాక్షసులకు చేసిన అన్యాయానికి జలంధరుడు చాలా బాధపడి దీక్షగా బ్రహ్మ కోసం తపస్సు చేసి మరణం లేకుండా వరమిమ్మన్నాడు. అప్పుడు బ్రహ్మ అతనితో నీ భార్య పాతివ్రత్యం తొలిగిపోనంతవరకు నీకు మరణంలేదని వరమిచ్చాడు. మరణ భీతి లేని జలంధరుడు దేవతలపై గెలుపొంది స్వర్గం కైవసం చేసుకున్నాడు. 
 
దీంతో దేవతలంతా శ్రీమహావిష్ణువుని శరణు వేడుకున్నారు. ఐతే సముద్రంలో తనతో పుట్టినవాడు కనుక జలంధరుని చంపవద్దని మహాలక్ష్మీ బ్రతిమాలగా మహావిష్టువు అతడిని క్షమించాడు. పైపెచ్చు బావమరిది కోరిక కాదనలేక సతీసమేతంగా వెళ్ళి అతడి ఇంట్లోనే కాపురం పెట్టాడు. అలాంటి సమయంలో నారద మహర్షి జలంధరుడి ఇంటికి వచ్చి అతనితో నీ సోదరియైన లక్ష్మీ ఇంటిలోనే వుంది. నీకు తగిన ఇల్లాలు పార్వతీ దేవియే. లక్ష్మీకి తోడు పార్వతి కూడా నీ ఇంట వుంటే నీకు తిరిగేలేదు అని పురికొల్పాడు. 
 
నిజమేననుకొని జలంధరుడు కైలాసానికి బయలుదేరాడు. వస్తున్న ముప్పును ముందుగానే పసిగట్టిన పార్వతి దేవి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది. పార్వతి కోరిక మేరకు విష్ణువు మాయ రూపం ధరించి బృంద పాతివ్రత్యాన్ని చెడగొట్టాడు. అనంతరం శివుడు అతడిని వధించాడు. ఇది తెలుసుకున్న బృంద కూడా మరణిస్తుంది. వారి మరణానికి పశ్చాత్తాపంతో వారిద్దరికి చెరో వరం ఇచ్చాడు. బృందను తులసీ చెట్టుగా జలంధరుడుని అత్తిపత్తిగా భూలోకంలో ఉండమని దీవించాడు. బృంద శాపాన్ని ఔదలదాల్చి ప్రతి ఇంటి తులసి కోటలో రాయిగా విష్ణువు స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేతు గ్రహ దోషాలను తొలగించే అన్నదమ్ములు.. వాళ్లెవరో తెలుసా?