ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ : క్రికెట్ కెప్టెన్ల సమావేశం వాయిదా.. ఎందుకో తెలుసా?

ఠాగూర్
శుక్రవారం, 31 జనవరి 2025 (11:31 IST)
వచ్చే నెలలో పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఇందులో పాల్గొనే క్రికెట్ జట్లకు చెందిన కెప్టెన్ల సమావేశం జరగాల్సివుంది. అయితే, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు అనుకున్న సమయం కంటే ఆలస్యంగా పాకిస్థాన్‌కు చేరుకుంటున్నాయి. దీంతో ఈ సమావేశం వాయిదాపడినట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. 
 
ఫిబ్రవరి 18వ తేదీన ఇంగ్లండ్ లాహోర్ చేరుకోగా, మరుసటి రోజు ఆస్ట్రేలియా చేరుకుంటుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19వ తేదీన పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ల సమావేశం సాధ్యం కాదని నివేదిక పేర్కొంది. 
 
ఇక భారత్ తన మ్యాచ్‌లను దుబాయిలో ఆడనున్న విషయం తెలిసిందే. భారత గ్రూపులో పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి. టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఆ తర్వాత 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడుతుంది. 
 
కాగా, ఐసీసీతో కలిసి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 16వ తేదీన లాహోర్‌లో నిర్వహించనుంది. పాక్, కివీస్ ఓపెనింగ్ మ్యాచ్‌కు ముందు షెడ్యూల్ చేసిన ఈవెంట్ల జాబితాను చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆమోదించారని పీసీబీ వర్గాలు న్యూస్ ఏజెన్సీ పీటీఐకి
తెలిపాయి.
 
ఫిబ్రవరి 7వ తేదీన పునర్నిర్మించిన గడాఫీ స్టేడియంను పీసీబీ అధికారికంగా ప్రారంభించనుంది. దీనికి ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అలాగే ఫిబ్రవరి 11న అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని ముఖ్య అతిథిగా ఆహ్వానించిన వేడుకతో పీసీబీ కరాచీలో పునర్నిర్మించిన నేషనల్ స్టేడియంను ప్రారంభించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

తర్వాతి కథనం
Show comments