డీఎస్పీగా భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ నియామకం!

ఠాగూర్
శుక్రవారం, 31 జనవరి 2025 (09:41 IST)
భారత మహిళా క్రికెట్ జట్టు ఆల్ రౌండర్‌గా గుర్తింపు పొందిన దీప్తి శర్మకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. ఆమెను డీఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఒక క్రికెటర్‌గా దేశానికి ఆమె చేసిన సేవకు గుర్తింపుగా జనవరి 27వ తేదీన యూపీలోని మొరాదాబాద్ జిల్లాలో డీఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని దీప్తి బుధవారం నాడు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా తెలియజేసింది. 
 
ఈ సందర్భంగా తనకు తగిన గౌరవం ఇచ్చినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఫొటోలను పంచుకుంది. 'ఈ మైలురాయిని సాధించినందుకు ఎంతో గర్వంగా ఉంది. డీఎస్పీ పోస్టుతో నా చిన్ననాటి కల నెరవేరింది. అన్ని విధాల నాకు తోడ్పాటు అందించిన నా కుటుంబానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి అచంచలమైన మద్దతు, ఆశీర్వాదాలు ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఈ అవకాశం కల్పించినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. డీఎస్పీగా నా విధులను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని హామీ ఇస్తున్నాను. నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు' అని దీప్తి శర్మ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. 
 
కాగా, 2024లో టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజు డీఎస్పీగా నియమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు దీప్తి శర్మ ఇటీవలి కాలంలో ఆ స్థానాన్ని పొందిన రెండవ భారతీయ క్రికెటర్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ambassador Car: పాత అంబాసిడర్ కారు పక్కన ఫోజులిచ్చిన చంద్రబాబు.. ఫోటోలు వైరల్ (video)

Anchor Shyamala: కర్నూలు బస్సు ప్రమాదం: 27 మంది వైఎస్‌ఆర్‌సిపి సభ్యులపై కేసు

AP: శ్రీశైలం నుండి విద్యుత్ కోసం తెలంగాణ వాటర్ తీసుకోవద్దు.. ఏపీ విజ్ఞప్తి

Krishna Water: సముద్రంలోకి 4.32 లక్షల క్యూసెక్కుల కృష్ణానది జలాలు

kasibugga stampede ఆ ఆలయం పండా అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

తర్వాతి కథనం
Show comments