Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుజరాత్‌లో నాలుగేళ్ల బాలుడుకి హెచ్ఎంపీవీ వైరస్!

Advertiesment
HMPV

ఠాగూర్

, శుక్రవారం, 31 జనవరి 2025 (08:30 IST)
గుజరాత్ రాష్ట్రంలో నాలుగేళ్ళ బాలుడుకి హెచ్ఎంపీవీ వైరస్ సోకింది. బాలుడుని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ బాలుడు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. దీంతో గుజరాత్ రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. బాలుడుకి వైద్య సాయం అందిస్తున్నామని అహ్మదాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ వైద్య అధికారి భవిన్ సోలంకి వెల్లడించారు. 
 
అహ్మదాబాద్‌లోని గోటా ప్రాంతానికి చెందిన ఈ నాలుగేళ్ల బాలుడు రెండు రోజుల క్రితం జ్వరం, దగ్గుతో బాధపడుతూ ఎస్జీవీపీ ఆస్పత్రిలో చేరగా, అతనికి జరిపిన వివిధ రకాలైన వైద్య పరీక్షలు చేశారు. ఇందులో హెచ్ఎంపీలవీ వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే, ఆ బాలుడు విదేశాలకు వెళ్లివచ్చిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ NEET, JEEలో శ్రేష్ఠత కోసం AIM ప్రోగ్రామ్ ప్రారంభం