Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్ ట్రోఫీ 2025 : 12న టీమిండియా జట్టు వెల్లడి

ఠాగూర్
మంగళవారం, 7 జనవరి 2025 (10:56 IST)
పాకిస్థాన్ వేదికగా జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ కోసం భారత సెలెక్టర్లు ఈ నెల 12వ తేదీన భారత క్రికెట్ జట్టును వెల్లడించే అవకాశం ఉంది. ఈ టోర్నీ కోసం ప్రకటించే జట్టుకు వైస్ కెప్టెన్‌గా బుమ్రా సారథ్యం వహించే అవకాశం ఉన్నట్టు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
కాగా, ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో పదేళ్ల తర్వాత బీజీ ట్రోపీని ఆస్ట్రేలియాకు అప్పగించి, పరాయజ భారంతో స్వదేశానికి తిరిగిరానుంది. 
 
ఆ తర్వాత స్వదేశంలో పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో తలపడనుంది. టీ20, వన్డే సిరీస్‌లను ఆడనుంది. ఈ నెల 22వ తేదీ నుంచి టీ20 సిరీస్, వచ్చే నెల ఆరో తేదీ నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. 
 
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్ కోసం చాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించే జట్టే ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చాంపియన్స్ ట్రోఫీకి ఈ నెల 12 లోపు ప్రొవిజనల్ జట్లను ప్రకటించాల్సి ఉంటుంది. వచ్చే నెల 13 వరకు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది.
 
ఈ క్రమంలో కొన్ని నెలలుగా జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, అర్షదీప్ సింగ్‌లకు చాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వీరు విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. ఇక, ఇంగ్లండ్‌తో సిరీసు స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్టు తెలిసింది. నాలుగు నెలల వ్యవధిలో అతడు ఏకంగా 10 టెస్టులు ఆడటం, ఇటీవల ముగిసిన మెల్‌బోర్న్ టెస్టులో 53.2 ఓవర్లు బౌలింగ్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 
 
అంతేకాదు, ఆసీస్ పర్యటనలో బుమ్రా మొత్తం 151.2 ఓవర్లు వేశాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు బుమ్రా అందుబాటులో లేకున్నా, చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటాడని చెబుతున్నారు. అంతేకాదు, చాంపియన్స్ ట్రోఫీలో అతడు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉన్నట్టు బీసీసీఐ వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హెచ్ఎంపీవి వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది.. లక్షణాలు.. చికిత్స... జాగ్రత్తలు ఏంటి?

పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులు.. మాస్కులు ధరించాలా? వద్దా? కర్నాటక అడ్వైజరీ

టీచర్‌కు నోటు పుస్తకం చూపిస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన బాలిక...

ప్రేమించుకున్నారు.. కానీ పెద్దలకు భయపడి కారులో ప్రేమ జంట ఆత్మహత్య!!

నేపాల్‌లో భారీ భూకంపం - భారత్ కూడా ప్రకంపనలు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అగాతియా నుంచి జీవా, రాశి ఖన్నాలపై ఫస్ట్ సింగిల్ గాలి ఊయలలో.. రిలీజ్

సినీ జర్నలిజాన్నే గౌరవంగా భావించి ఎదిగిన బి ఏ రాజు- 65వ జయంతి

గేమ్ చేంజర్ నా ఆలోచనాధోరణి మార్చింది - చిరంజీవి ప్రశంస నేషనల్ అవార్డు : అంజలి

సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లో కథ చెప్పేసిన అనిల్ రావిపూడి - ప్రివ్యూ

పబ్లిక్‌గా పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పడాన్ని చూసి పాదాభివందనం చేయాలనిపించింది: దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments