నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అఖిల భారత స్థాయిలో ఇంజనీరింగ్, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ తేదీలను ప్రకటించింది. జనవరి 22 నుంచి జనవరి 30 వరకు పరీక్షలు జరగనున్నాయి.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకారం JEE మెయిన్ పరీక్షలు రెండు షిఫ్టులలో జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 6:30 వరకు నిర్వహించబడుతుంది.
అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను షెడ్యూల్ పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు అధికారిక పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేసుకోగలరు. ఇక తొలి దశకు దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఏకంగా 13.8 లక్షల మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.