Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుప్పంలో క్రాక్ అకాడమీ మెగా స్కాలర్‌షిప్ పరీక్షలో పాల్గొన్న 25 వేల మంది విద్యార్థులు

Students

ఐవీఆర్

, మంగళవారం, 31 డిశెంబరు 2024 (20:02 IST)
ఒక సంచలనాత్మక కార్యక్రమంలో భాగంగా, క్రాక్ అకాడమీ మొత్తం కుప్పం నియోజకవర్గంలో మెగా స్కాలర్‌షిప్ పరీక్షను నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(కాడా)తో భాగస్వామ్యం చేసుకుంది. క్రాక్ అకాడమీ యొక్క సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగమైన ఈ కార్యక్రమం, ఈ ప్రాంతం నుండి విద్యా ప్రతిభను గుర్తించడం, పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. స్కాలర్‌షిప్ పరీక్షలో కుప్పంలోని 200 పైగా పాఠశాలలు మరియు కళాశాలల్లోని 25,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రదర్శన చేసిన 100 మందికి స్కాలర్‌షిప్‌లను క్రాక్ అకాడమీ అందజేస్తుంది.
 
క్రాక్ అకాడమీ సీఈఓ, వ్యవస్థాపకుడు నీరజ్ కన్సల్ మాట్లాడుతూ, “ఈ పరివర్తనాత్మక కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేతులు కలపడం మాకు చాలా ఆనందంగా ఉంది. క్రాక్ అకాడమీ వద్ద విద్యార్థులకు సమాన అవకాశాలను అందించాలని మేము దృఢంగా విశ్వసిస్తున్నాము. ఈ మెగా టెస్ట్ ద్వారా, మేము యువత సామర్థ్యాన్ని గుర్తించి, వారి కలలను సాధించడానికి అవసరమైన వనరులతో వారిని సన్నద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాము" అని అన్నారు.
 
క్రాక్ అకాడమి, కాడా చేస్తున్న కృషిని వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు అభినందించారు. కుప్పంలోని ప్రముఖ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు ఒకరు మాట్లాడుతూ, “ఈ తరహా కార్యక్రమాలు ప్రతిభను గుర్తించడమే కాకుండా విద్యార్థులు మరింత కష్టపడి ఉన్నత లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహిస్తాయి. ఈ అవకాశాన్ని మా ప్రాంతానికి తీసుకువచ్చినందుకు క్రాక్ అకాడమీకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము" అని అన్నారు.
 
స్కాలర్‌షిప్‌కు అర్హత సాధించిన విద్యార్థులలో ఒక్కొక్కరు రూ. 50,000 కంటే ఎక్కువ విలువైన క్రాక్ అకాడమీ యొక్క ప్రతిష్టాత్మక కోర్సులను పొందేందుకు సమగ్ర మద్దతును అందుకుంటారు. దీంతో వారు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి, కెరీర్ ఆకాంక్షలను సాధించేందుకు వీలవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండితో సాయంతో... (Video)