Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ దేశానికి హీరో .. రీప్లేస్ చేయడం చాలా కష్టం : రిషభ్ పంత్

ఠాగూర్
సోమవారం, 6 జనవరి 2025 (11:37 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌పై యువ క్రికెటర్ రిషభ్ పంత్ ప్రశంసల వర్షం కురిపంచారు. ధోనీ దేశానికి హీరో అని, అతన్ని రీప్లేస్ చేయడం చాలా కష్టమన్నాడు. కొందరికి దేశ వ్యాప్తంగా అభిమానులు ఉంటారని అలాంటి వ్యక్తి ధోనీ అని, అతను ఉన్న భారత జట్టులో తాను కూడా సభ్యుడు కావడం మరింత గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. 
 
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి వ్యక్తికి భారత జట్టులో అతడితో కలిసి ఆడినవారు మరింత గౌరవం ఇస్తారు. ధోనీ తమ మార్గదర్శి అని గర్వంగా చెప్పే క్రికెటర్లూ ఉన్నారు. వారిలో టీమ్స్ఇండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ముందుంటాడు. భారత జట్టుకు రెండుసార్లు ప్రపంచ కప్‌ను అందించిన సారథిగా ధోనీ చిరస్థాయిగా నిలిచిపోతాడని ప్రశంసలు కురిపించాడు. ధోనీని రీప్లేస్ చేయడం చాలా కష్టమని.. ఆ దిశగా తాను సాగుతానని వెల్లడించాడు.
 
'ధోనీ దేశానికి హీరో. వ్యక్తిగతంగా, క్రికెటర్ అతడి నుంచి ఎన్నో అంశాలను నేర్చుకున్నా. ధోనీ ఉన్నాడంటే.. జట్టులో ఎంతో నమ్మకం పెరుగుతుంది. నాకేదైనా సమస్య ఉంటే.. అతడితో పంచుకొంటా. దానికి పరిష్కారం కూడా వస్తుంది. వికెట్ కీపర్, ఆటగాడిగా ఓర్పు అత్యంత కీలకమని ధోనీ నాకిచ్చే సలహా. ప్రశాంతంగా ఉంటూ 100 శాతం ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించాలని చెబుతుంటాడు. నేనెప్పుడూ ధోనీతో నా రికార్డుల విషయాన్ని పోల్చుకోను. క్యాచ్‌లను అందుకోవడం మ్యాచ్‌కు అత్యంత కీలకం. దాని గురించి మరీ ఎక్కువగా ఆలోచించను' అని పంత్ తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నటి మాధవీలత క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి

17న సమావేశమవుతున్న ఏపీ మంత్రివర్గ భేటీ

గృహాలు - హోటళ్ళలో వాడే నూనెతో కేన్సర్ : అమెరికా సర్జన్ వెల్లడి

మూడు రైళ్లకు చర్లపల్లిలో స్టాపేజీ.. దక్షిణ మధ్య రైల్వే

రహదారులను ప్రియాంకా బుగ్గల్లా తీర్చిదిద్దుతాం : రమేశ్ బిధూడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

A.R. Rahman పుట్టినరోజు.. బ్రయోగ్రఫీ ఏంటి.. అసలు పేరేంటి?

దిల్ రాజు అత్యవసర సమావేశంలో షాకింగ్ విషయాలు

ఛాన్స్ వస్తే అకిరా నందన్‌తో ఖుషి 2 ప్లాన్ చేస్తా

గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్-పవన్ కల్యాణ్- చెర్రీ వీడియో వైరల్.. (video)

అప్పుట్లో ఐడియాలజీ అర్థం కాలేదు, ఆ సినిమా చేశాక ఇండియన్ 2లో ఛాన్స్ : ఎస్ జే సూర్య

తర్వాతి కథనం
Show comments