ఏఐ టెక్నాలజీ పుణ్యంతో రోజు రోజుకీ కొత్త కొత్త ఇమేజ్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సెలెబ్రిటీల ఫోటోలు ఏఐ సాయంతో నెట్ లోకి వస్తున్నాయి. తాజాగా క్రికెటర్ల చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. టీమిండియా స్టార్ క్రికెటర్లు చిన్ననాటి ఫోటోలున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, ప్రగ్యా జైశ్వాల్, బుమ్రా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌లు చిన్నప్పుడు అంటే పినప్రాయంలో ఎలా వుంటారో అలా అచ్చం వుండేలా ఈ ఫోటోలున్నాయి.
ఈ ఫోటోలకు సంబంధించిన వీడియో చూసి నెటిజన్లతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ వీడియోలోని బుల్లి క్రికెటర్లను చూసి వారు మురిసిపోతున్నారు. ఇంకా ఆ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.
ఇప్పటికే ఐపీఎల్ క్రికెటర్లకు సంబంధించిన ఏఐ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయిన దాఖలాలు వున్నాయి. ప్రస్తుతం టీమిండియా స్టార్ ప్లేయర్ల ఫోటోలు వీడియో రూపంలో నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి.