Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్టుకు వర్షం అంతరాయం

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (13:00 IST)
studium
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌కు వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది. వర్షం కారణంగా నాలుగో రోజు ఆట ముందే ముగిసింది. 328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 1.5 ఓవర్లలో 4 పరుగులు చేసింది. 
 
ఈ సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత చాలా సేపటి వరకూ వర్షం కురుస్తూనే ఉండటంతో నాలుగో రోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. మరో రోజు ఆట మాత్రమే మిగిలి ఉండగా.. టీమిండియా విజయానికి 324 పరుగుల దూరంలో ఉంది. రోహిత్ శర్మ (4 నాటౌట్‌), శుభ్‌మన్ గిల్‌(0 నాటౌట్‌) క్రీజులో ఉన్నారు.
 
సిరాజ్‌కు 5 వికెట్లు..
అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుంటే.. ఓవరాల్‌గా ఆస్ట్రేలియా 327 పరుగుల లీడ్‌లో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ 5 వికెట్లు తీయడం విశేషం. సీనియర్ బౌలర్లు లేకపోయినా ఆ భారాన్ని తన భుజాలపై మోసిన సిరాజ్‌..
 
టెస్ట్ కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అటు శార్దూల్ కూడా 4 వికెట్లతో రాణించాడు. సుందర్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా టీమ్‌లో స్మిత్ 55, వార్నర్ 48, గ్రీన్ 37 పరుగులు చేశారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments