Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

AUSvIND స్టార్‌వార్స్ గెటప్‌లో సందడి చేసిన అభిమానులు

Advertiesment
AUSvIND స్టార్‌వార్స్ గెటప్‌లో సందడి చేసిన అభిమానులు
, ఆదివారం, 17 జనవరి 2021 (18:01 IST)
Gabha Test
గబ్బా వేదికగా టీమిండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య శనివారం జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన పలువురు అభిమానులు స్టార్‌వార్స్‌ గెటప్‌లో దర్శనమిచ్చారు. తెల్లటి దస్తులు, మాస్కులు ధరించి స్టేడియంలో సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను,చిత్రాలను ఐసీసీ తన ట్విటర్‌లో ఖాతాలో షేర్ చేసింది.
 
'బెస్ట్‌ డ్రెసప్‌ అవార్డు' అనే క్యాప్షన్‌తో ఈ పోస్ట్ పెట్టింది ప్రస్తుతం వీటికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఈ దృశ్యాలపై నెటిజన్లు రకారకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే క్రికెట్ ఆస్ట్రేలియ కూడా దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేరు చేసింది. ' సాధారణ బ్రిస్బేన్ ప్రవర్తన #AUSvIND,' అనే క్యాప్షన్‌తో ఆ పోస్ట్ పెట్టింది.
 
ఈ టెస్ట్ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. ఈ నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇండియా 1-1తో సమానంగా ఉన్నాయి. బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియా,భారత్ మధ్య జరుగుతోన్న చివరి టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ వికెట్ నష్టపోకుండా 6 ఓవర్లలో 21 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి డేవిడ్‌ వార్నర్‌(20), మార్కస్‌ హారిస్‌(1) క్రీజులో ఉన్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్ట్రేలియాతో టెస్టు.. హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన శార్దూల్‌, సుందర్‌.. రికార్డ్