Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సారీ ఫ్రెండ్స్.. ఆ పని చేయలేను... జీవితాంతం సిగ్గుపడాల్సి వస్తుంది.. లారెన్స్

Advertiesment
సారీ ఫ్రెండ్స్.. ఆ పని చేయలేను... జీవితాంతం సిగ్గుపడాల్సి వస్తుంది.. లారెన్స్
, గురువారం, 14 జనవరి 2021 (08:19 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అభిమానులు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. కానీ, ఆరోగ్యం దృష్ట్యా తాను రాజకీయాల్లోకి రాలేనంటూ రజనీకాంత్ ఓ ప్రకటన చేశారు. అయితే, రజనీకాంత్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చూడాలంటూ లారెన్స్‌ను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన లారెన్స్.. తాను ఆ పని చేయలేనని, తనను క్షమించాలని అభిమానులను వేడుకున్నాడు.
 
ఇదే అంశంపై లారెన్స్ ఓ ట్వీట్ చేశారు. రజనీకాంత్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చూడాలని చాలామంది తనకు మెసేజ్‌లు, ట్వీట్లు చేస్తున్నారని పేర్కొన్న లారెన్స్.. ఆయన నిర్ణయంతో అభిమానులు అనుభవిస్తున్న బాధకు రెట్టింపు బాధను తాను కూడా అనుభవిస్తున్నట్టు చెప్పాడు. రజనీ రాజకీయాల్లోకి రాకపోవడానికి వేరే కారణం ఏదైనా ఉండి ఉంటే మనం అభ్యర్థించవచ్చని, కానీ ఆయన ప్రధాన కారణం అనారోగ్యమని పేర్కొన్నాడు.
 
మన వల్ల ఆయన మనసు మార్చుకుని రాజకీయాల్లోకి వచ్చి, మళ్లీ అనారోగ్యం పాలైతే జీవితాంతం మనం సిగ్గుతో బాధపడాల్సి ఉంటుందన్నాడు. ఆయన ఎప్పటికీ తన గురువేనని స్పష్టం చేశాడు. ఆయన ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనం ప్రార్థిద్దామని లారెన్స్ చెప్పుకొచ్చాడు.
 
కాగా, రజనీకాంత్ ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది తిరిగి కోలుకున్నారు. ఆ తర్వాత తాను రాజకీయ పార్టీ పెట్టబోవడం లేదంటూ స్పష్టం చేశాడు. తలైవా నిర్ణయంతో తీవ్ర నిరాశ చెందిన అభిమానులు రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్ర‌భాస్ పాత్ర‌ను ఛాలెంజ్‌గా తీసుకున్నా: బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌