Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్ - ధోనీ తర్వాత మూడో క్రికెటర్ కోహ్లీ అవుతాడా?

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, జార్ఖండ్ డైనమెట్‌ మహేంద్ర సింగ్ ధోనీలు రాజీవ్ ఖేల్‌రత్న పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఈ పురస్కారానికి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరును భారత

Webdunia
గురువారం, 26 ఏప్రియల్ 2018 (15:00 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, జార్ఖండ్ డైనమెట్‌ మహేంద్ర సింగ్ ధోనీలు రాజీవ్ ఖేల్‌రత్న పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఈ పురస్కారానికి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సిఫార్సు చేసింది. 2016లో కోహ్లీ పేరును సిఫార్సు చేయగా అపుడు నిరాశే ఎదురైంది.
 
ఈ నేపథ్యంలో ఇపుడు మరోమారు కోహ్లీ పేరును బీసీసీఐ సిఫార్సు చేసింది. ఒకవేళ ఈ ఏడాది కోహ్లీని అదృష్టం వరిస్తే సచిన్, ధోని తర్వాత ఈ అవార్డు అందుకున్న మూడో క్రికెటర్ కోహ్లీయే అవుతాడు. మరోవైపు, జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పేరును ద్రోణాచార్య అవార్డుకు ప్రతిపాదించింది. సునీల్ గవాస్కర్‌ను ధ్యాన్ చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు సిఫారసు చేసింది. పలు కేటగిరీలకుగాను చాలా వరకు నామినేషన్లను పంపినట్టు బీసీసీఐ ధ్రువీకరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments