Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ : పోరాడి ఓడిన జింబాబ్వే

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (13:46 IST)
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, ఆదివారం సూపర్-12 గ్రూపు 2లోని బంగ్లాదేశ్, జింబాబ్వే జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు పోరాడి ఓడిపోయింది చివరి ఓవర్ చివరి బంతికి గెలిచే ఆ జట్టు గెలిచే అవకాశం ఉన్నప్పటికి ఓడిపోయింది. చివరకు 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో బంగ్లాదేశ్ ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఫలితంగా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింద. ఓపెనర్ హుస్సేన్ షాం చెలరేగి ఆడాడు. 55 బంతుల్లో 71 రన్స్ చేశాడు. ఆ తర్వాత అఫీఫ్ హుస్సేన్ 29 పరుగులు చేశాడు. మిగిలిన ఆటగాళ్లు చేతులెత్తేశారు. 
 
ఆ తర్వాత 151 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్లు ఇద్దరూ సింగిల్ డిజిట్‌కే వెనుదిరిగారు. సీన్స్ విలియమ్స్ ఒక్కటే దాటిగా ఆడాడు. 42 బంతుల్లో 64 పరుగులు చేశాడు. 
 
మిగిలిన ఆటగాళ్లు చేతులెత్తేశారు. 147 పరుగుల వద్ద ఆగిపోయింది. తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు తీయగా, మొసద్దిక్ హుస్సేన్, ముస్తఫిజుర్ రెహ్మాన్ చెరో రెండు వికెట్లతో జింబాబ్వేను కట్టిడి చేశారు. తద్వారా బంగ్లాదేశ్ విజయంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. 

సంబంధిత వార్తలు

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

తర్వాతి కథనం
Show comments