ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ మెగా టోర్నీలో భాగంగా, సూపర్-12 గ్రూపు బిలో గురువారం క్రికెట్ పసికూన నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ సునాయాసంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లోనూ భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలించారు. మరో ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ బౌండరీలతో వీరవిహారం చేశాడు. ఫలితంగా 179 పరుగులు చేసింది. ఆ తర్వాత 180 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో 123 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా 56 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (9), రోహిత్ శర్మ (53), విరాట్ కోహ్లీ (62), సూర్యకుమార్ యాదవ్ (51) చొప్పున పరుగులు చేశారు. సూర్య కుమార్ 25 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో చెలరేగిపోయాడు. ఫలితంగా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
180 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు ఆటగాళ్ళ ఏ దశలోనూ క్రీజ్‌లో కుదురుగా బౌలింగ్ చేయలేకపోయారు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయే బ్యాటర్లతో ఆ జట్టు తన ఇన్నింగ్స్‌లో ఏ కోశాన ఆకట్టులేదనే చెప్పాలి. ఫలితంగా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్, అక్షర్ పటేల్‌లకు రెండేసి వికెట్లు తీశారు.