Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలోని సైనిక స్కూళ్ళలో ప్రవేశాలకు నోటిఫికేషన్

sainik schools
, బుధవారం, 26 అక్టోబరు 2022 (13:46 IST)
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న సైనిక స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను విడుదలైంది. ఆరో తరగతి, తొమ్మిదో తరగతుల్లో చేరేందుకు ఈ నోటిఫికేషన్ జారీచేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న 33 సైనిక్ స్కూళ్ళలో 4786 సీట్ల భర్తీని రాత పరీక్ష ద్వారా చేపడుతారు. ఆరో తరగతి అడ్మిషన్ కోసం విద్యార్థి వయస్సు 2023 మార్చి 31వ తేదీ నాటికి 10 నుంచి 12 యేళ్లలోపు ఉండాలి. 9వ తరగతి అడ్మిషన్ కోరే విద్యార్థి వయసు 13 నుంచి 15 యేళ్లలోపు ఉండాలి. 
 
2022-23 విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుంగా జనరల్ కేటగిరీ విద్యార్థులు రూ.650, ఎస్టీఎస్టీ విద్యార్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను 2022 నవంబరు 30వ తేదీ లోపు పంపించాల్సి ఉంటుంది. 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లో సైనిక పాఠశాలలు అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్‌లలో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 6, 9 తరగతుల్లో కలిపి 4786 సీట్లు ఉండగా, ఇందులో 4404 సీట్లు ఉన్నాయి. 
 
అందులో ప్రభుత్వ సీట్లు 2897 కాగా, ప్రైవేటు సీట్లు 1510 చొప్పున ఉన్నాయి తొమ్మిదో తరగతిలో 382 సీట్లు ఉన్నాయి. సైనిక స్కూల్ ఉన్న రాష్ట్రంలో స్థానిక విద్యార్థులకు 67 శాతం రిజర్వు చేస్తారు. మొత్తం సీట్లలో ఎస్టీ విద్యార్థులకు 15 సీట్లు, ఎస్టీ విద్యార్థులకు 7.5 శాతం, ఇతరులకు 27 శాతం సీట్లు కేటాయిస్తారు. మిగిలిన సీట్లలో 25 శాతం రక్షణ శాఖ మాజీ ఉద్యోగుల పిల్లలకు, 25 శాతం సీట్లను ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు కేటాయిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రిటన్ రాజు ఆస్తుల కంటే అక్షత మూర్తి ఆస్తులే ఎక్కువ!!