Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెర్త్‌లో ఊరిస్తున్న విజయం : ఆసీస్ 243 ఆలౌట్.. భారత్ లక్ష్యం 287

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (12:39 IST)
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ముంగింట మరో విజయం ఊరిస్తోంది. పెర్త్ వేదికగా సాగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. ఆసీస్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 243 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కలుపుకుని భారత్ ముంగిట 287 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఏకంగా ఆరు వికెట్లు తీయగా, బుమ్రా మూడు వికెట్లు, ఇషాంత్ ఒక వికెట్ తీశాడు. 
 
దీంతో ఈ మ్యాచ్‌లో విజయం భారత్‌ను ఊరిస్తుందని చెప్పొచ్చు. పైగా, ఈ మ్యాచ్‌ దాదాపు ఒకటిన్నర రోజు మిగిలివుంది. భారత జట్టులోని ఇద్దరు లేదా ముగ్గురు ఆటగాళ్లు రాణిస్తే మాత్రం టీమిండియా ఖాతాలో మరో విజయం నమోదైనట్టే. ఇప్పటికే తొలి టెస్టులో భారత్ విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే. 
 
పైగా, తొలి ఇన్నింగ్స్‌లో కష్టాల్లో ఉన్న సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరోచిత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అలాగే, రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణిస్తే భారత జట్టు గెలుపు నల్లేరుపై నడకేనని చెప్పొచ్చు. అయితే, భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రాహుల్ డకౌట్ అయ్యాడు. దీంతో భారత తొలి వికెట్‌ను కోల్పోయింది. 

సంబంధిత వార్తలు

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

ఏపీ ఎన్నికల ప్రచారంలో కనిపించని అలీ.. కారణం శివాజీయేనా?

జైలులో భర్త.. భర్త తమ్ముడితో పెళ్లి.. ఏడు నెలల పసికందు హత్య.. ఎలా?

వాష్ బేసిన్ నుండి నీళ్లు త్రాగవలసి వచ్చింది.. ముద్రగడ ఆవేదన

తెలంగాణలో అత్యధికంగా అభ్యర్థుల నామినేషన్ల దాఖలు

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రెండు భాగాలు, మూడు పాత్రల టీనేజ్ లవ్ స్టోరీతో ఎస్ కే ఎస్ క్రియేషన్స్ చిత్రం

సమంత, రాజ్ & డికె లాంచ్ చేసిన అనుపమ పరమేశ్వరన్ 'పరదా' ఫస్ట్ లుక్

ఆడ పిల్లనే అయితే ఏంటట ? అంటూ ప్రశ్నిస్తున్న పోలీస్‌ఆఫీసర్‌ చాందిని చౌదరి యేవమ్‌ లుక్‌

తర్వాతి కథనం
Show comments