Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆప్ఘాన్ - సూపర్-4కు అర్హత

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (09:41 IST)
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మరో మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ జట్టు వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రత్యర్థి బంగ్లాదేశ్‌తో తలపడిన మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఫలితంగా ఆ జట్టు విజయభేరీ మోగించి సూపర్-4కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. 
 
ఈ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో శ్రీలంక జట్టును చిత్తు చేసిన ఆప్ఘన్ కుర్రోళ్లు, రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించారు. తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. మొసద్దక్ 48 పరుగులతో టాప్ స్కోరర్‌‌గా నిలిచాడు. 
 
ఆ తర్వాత 128 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘన్ జట్టు 18.3 ఓవర్లలోనే మూడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. నజీబుల్లా జద్రాన్ 17 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఓ ఫోర్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 43 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే, ఇబ్రహీం 42 పరుగులతే రాణించాడు. ఫలితంగా ఏడు వికెట్ల తేడాతో శ్రీలంకు ఓడించంది. మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్ మ్యాచ్ అవార్డు ముజీబ్‌కు దక్కింది. ఈ విజయంతో సూపర్-4కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఆప్ఘన్ నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments