Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ.. సచిన్ బాటలో అర్జున్

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (18:21 IST)
Arjun Tendulkar
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీని నమోదు చేసుకున్నాడు. గోవా రంజీ టీమ్ తరపున దేశవాళీ బరిలో దిగిన అర్జున్ టెండూల్కర్ రాజస్థాన్ జట్టుతో గ్రూప్-సి మ్యాచ్‌లో అందరినీ ఆకట్టుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అర్జున్ 207 బంతుల్లో 120 పరుగులు చేశాడు. ఇందులో 16ఫోర్లు, 2 సిక్సులు వున్నాయి. 
 
మాస్టర్ సచిన్ తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీతో ఔరా అనిపించాడు. ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ కూడా తండ్రి బాటలోనే నడిచి తొలి మ్యాచ్‌తోనే శతక వీరుల జాబితాలో చేరాడు. ఈ ఘనతను 15ఏళ్ల వయస్సుల్లో సచిన్ సెంచరీ సాధించగా.. అర్జున్ 23 ఏళ్ల వయస్సులో సాధించాడు. 
 
అర్జున్ టెండూల్కర్ అదిరిపోయే వంద పరుగులు సాధించి.. గోవా రెండో రోజు ఆట చివరికి తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 493 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో ప్రభుదేశాయ్ డబుల్ సాధించినప్పటికీ ఈ మ్యాచ్‌లో హైలైట్ అంటే అర్జున్ టెండూల్కర్ ఇన్నింగ్సే అని చెప్పాలి. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments