Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాతో తొలి టెస్ట్.. తడబడుతూ సాగిన భారత్ బ్యాటింగ్.. ఫస్టే డే స్కోరు 278/6

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (18:02 IST)
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులతో క్రీజ్‍‌లో ఉన్నాడు. 
 
మరోవైపు, పుజారా 90 పరుగులు చేసి మరో పది పరుగుల తేడాతో సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 45 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేశాడు. 
 
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్... ఒక దశలో నాలుగు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన పుజారా, శ్రేయస్ అయ్యర్‌ను నింపాదిగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త వహించాడు. 
 
ఈ క్రమంలో పుజార్ 203 బంతులు ఎదుర్కొని 11 ఫోర్ల సాయంతో 90 పరుగులు చేశాడు. అలాగే, శ్రేయాస్ అయ్యర్ కూడా తన వికెట్‌ను కాపాడుకుంటూ 169 సిక్స్‌లో 10 ఫోర్లతో 82 పరుగులు చేశాడు. టీమిండియా ఓపెనర్లు రాహుల్ 22, గిల్ 20 చొప్పున పరుగులు చేసి విఫలమయ్యారు.
 
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం ఒక్క పరుగుకే వికెట్ సమర్పించుకుని నిరాశపరిచాడు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది బంగ్లాదేశ్ బౌలర్లలో ఇస్లామ్ 3, హాసన్ 2, అహ్మద్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

వైఎస్సార్‌సీపీది అత్యంత నీచమైన పాలన.. నారా లోకేష్ ఫైర్

మాజీ ప్రేమికుడి వేధింపులు.. 22 ఏళ్ల టీచర్ ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

తర్వాతి కథనం
Show comments