Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్ భలే రికార్డ్.. కోహ్లీ రికార్డును సమం చేసిన గుర్బజ్..

సెల్వి
శనివారం, 21 సెప్టెంబరు 2024 (11:39 IST)
Gurbaz
షార్జా వేదిక‌గా శుక్ర‌వారం జ‌రిగిన రెండో వ‌న్డేలో దక్షిణాఫ్రికాపై ఆప్ఘనిస్థాన్ రికార్డ్ విజ‌యాన్ని సాధించింది. క్రికెట్‌లో ప‌సికూన ఆప్ఘనిస్థాన్ చ‌రిత్ర‌ను సృష్టించింది. తొలిసారి సౌతాఫ్రికాపై వ‌న్డే సిరీస్‌ను నెగ్గింది. 
 
177 ప‌రుగుల‌తో తేడాతో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో రెండు వ‌న్డేల్లో గెలిచిన ఆప్ఘనిస్థాన్ 2-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. శుక్ర‌వారం జ‌రిగిన రెండో వ‌న్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ యాభై ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు మాత్ర‌మే న‌ష్ట‌పోయి 311 ప‌రుగులు చేసింది. 
 
ఓపెన‌ర్ ర‌హ్మ‌తుల్లా గుర్భాజ్ అద్భుత సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. 110 బాల్స్‌లో ప‌దిఫోర్లు, మూడు సిక్స‌ర్ల‌తో105 ప‌రుగుల చేశాడు. ఈ మ్యాచ్‌లో సెంచ‌రీ సాధించిన ర‌హ్మ‌తుల్లా గుర్భాజ్... టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ కోహ్లి రికార్డ్‌ను స‌మం చేశాడు. 
 
23 ఏళ్ల వ‌య‌సులోపే వ‌న్డేల్లో ఎక్కువ‌ సెంచ‌రీలు చేసిన క్రికెట‌ర్‌గా కోహ్లితో పాటు స‌మంగా నిలిచాడు. తదనంతరం 312 ప‌రుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ దిగిన సౌతాఫ్రికా 34. 2 ఓవ‌ర్ల‌లో 134 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కెప్టెన్ బ‌వుమా 38 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.
 
వ‌న్డేల్లో ఆప్ఘనిస్థాన్ అతి పెద్ద గెలుపును తన ఖాతాలో వేసుకుంది. 2018లో జింబాబ్వేపై 154 ప‌రుగుల‌తో విజ‌యం సాధించింది. ఆ రికార్డ్‌ను సౌతాఫ్రికా మ్యాచ్‌తో ఆప్ఘన్ తిర‌గ‌రాసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లింగ్.. భార్యగా నటించేందుకు మహిళను అద్దెకు తీసుకున్నాడు..

కాదంబరి వ్యవహారం: వైఎస్సార్‌సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ అరెస్టు

సింగరేణి కార్మికులకు రూ. 1.90లక్షల బోనస్‌.. దసరా కానుక

గణేష నిమజ్జనం- మహిళల పట్ల అలా ప్రవర్తించారు.. 999 మంది అరెస్ట్

సైబర్ నేరగాళ్ల పంజా.. సుప్రీం కోర్టు యూట్యూబ్ హ్యాక్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ తో కలిసి భోజనాలు, బట్టలు పంపిణీ చేసిన అక్కినేని కుటుంబం

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

తర్వాతి కథనం
Show comments