Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ల పాప బ్యాటింగ్‌కు నెటిజన్లు ఫిదా: ఇదిగోండి మరో ఫ్యూచర్ సూపర్ స్టార్‌!

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (22:48 IST)
mehak fathima
ఆరేళ్ల బాలిక బ్యాటింగ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె కోజికోడ్‌కు చెందిన ఆరేళ్ల మెహక్ ఫాతిమా. ఇంత చిన్న వయసులోనే తన అసాధారణ ప్రతిభతో పలువురి ప్రశంలందుకుంటోంది. ముఖ్యంగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర ఈ చిన్నారిని ప్రతిభకు ముగ్ధులైపోయారు.

ఇదిగో మరో ఫ్యూచర్ సూపర్ స్టార్‌ను చూడండి అంటూ ఆమె వీడియోను పోస్టు చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ అమ్మాయిపై  ఓసారి దృష్టి సారించండి.. ఈమె ప్రతిభను వృధాకానివ్వకండి అంటూ కేంద్ర  క్రీడాశాఖమంత్రి కిరణ్‌ రిజుజుకి టాగ్‌ చేశారు. 
 
ది బెటర్‌ ఇండియా ఈ చిచ్చర పిడుగును  ట్విటర్‌ వేదికగా పాతిమా టాలెంట్‌ను పరిచయం చేసింది. అలాగే  ఇన్‌స్టా అకౌంట్‌లో కూడా మెహక్‌  పాతిమా విశేషాలు వీడియోలున్నాయి. ఫాతిమా తన తండ్రి తన కంటే  మూడేళ్లు చిన్నవాడైన తమ్ముడికి క్రికెట్‌ నేర్పిస్తుండగా జాగ్రత్తగా పరిశీలించింది. బ్యాటింగ్‌తో అదరగొట్టింది. తమ్ముడితో పాటు తనకు కూడా క్రికెట్ నేర్పమని తండ్రిని డిమాండ్‌ చేసింది. దీంతో ఆయన ఫాతిమాకు కూడా నేర్పించసాగారు. 
 
ఆమె నేర్చుకున్న తీరుకు స్వయానా తండ్రే ఆశ్యర్యపోయాడు. ఇక ఫాతిమా ప్రాక్టిసు చేస్తున్న వీడియో చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియోకు పోస్ట్‌ చేసిన గంట వ్యవధిలోనే 31 వేలకు పైగా వ్యూస్‌ లభించాయి. 
 
ఇకపోతే.. ఫాతిమా తండ్రి మునీర్‌ క్రికెటర్‌ కావడం విశేషం. మునీర్ తన 13 ఏళ్ళ వయసులోనే కాలికట్ విశ్వవిద్యాలయం జట్టు తరపున ఆడారట. ఇక ఫాతిమా సోదరుడు 18 నెలల వయసులో  క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. భవిష్యత్తులో తను మంచి క్రికెటర్‌  కావాలనుకుంటోందనీ,  స్మృతి మంధన అంటే  ఎంతో ఇష్టమని, ఆమెను ఫాలో అవుతూ, ఆమెలాగే ఆడాలని  ప్రయత్నిస్తుందని ఆమె తల్లిదండ్రులు చెప్తున్నారు. అదన్నమాట సంగతి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

తర్వాతి కథనం
Show comments