Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి ట్వంటీ20 సమరం.. ధోనీ లేకుండానే బరిలోకి భారత్‌

Webdunia
ఆదివారం, 4 నవంబరు 2018 (12:41 IST)
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ట్వంటీ20 సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అందుబాటులోవుండడు. పైగా, భారత్‌కు ఎన్నో ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో ఫినిషర్‌గా కీలక పాత్ర పోషించిన ధోనీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
2006లో టీ20జట్టుకు ఎంపికవడం, మరుసటి ఏడాదే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడమే కాదు 2007లో పొట్టి క్రికెట్‌ తొలి వరల్డ్‌ కప్‌ను జట్టుకు అందించడం అతడి సత్తాకు నిదర్శనం. అలాంటి గొప్ప బ్యాట్స్‌మన్‌, కీపర్‌ ధోనీ లేకుండా టీమిండియా ఈసారి టీ20 బరిలోకి దిగుతోంది. అలాగే రెగ్యులర్‌ కెప్టెన్‌ కోహ్లీకి విశ్రాంతి కారణంగా రోహిత్‌ శర్మ సారథ్యంలో భారత జట్టు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగే తొలి టీ20లో వెస్టిండీస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.
 
ఇకపోతే, టెస్ట్‌, వన్డే సిరీ్‌సలలో ఘోరంగా ఓడినా కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ సారథ్యంలోని కరీబియన్‌ జట్టు టీ20ల్లో ప్రమాదకారేనని చెప్పొచ్చు. ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో విండీస్‌ కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడాడు. 2016 టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్లో బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది తన జట్టుకు ట్రోఫీ అందించాడు. టీ20 స్టార్లు డారెన్‌ బ్రావో, కీరన్‌ పొలార్డ్‌ చేరికతో ఆ జట్టులో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. 
 
ఇకపోతే, కెప్టెన్‌ రోహిత్‌కు కలిసి వచ్చిన మైదానమే. వన్డేల్లో 264 పరుగుల వరల్డ్‌ రికార్డును 2014లో అతడు ఇక్కడే నమోదు చేశాడు. అంతేకాదు.. 2013, 2015లో ముంబై ఇండియన్స్‌కు రెండు ఐపీఎల్‌ టైటిళ్లను ఈ గ్రౌండ్‌లోనే అందించాడు. అలాగే ఇటీవల వన్డేల్లో కనబరుస్తున్న అద్భుత ఫామ్‌ను ఈ సిరీస్‌లోనూ కొనసాగించాలని రోహిత్‌ భావిస్తున్నాడు. 
 
ఇరు జట్ల వివరాలు... 
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), ధవన్‌, రాహుల్‌, దినేష్‌ కార్తీక్‌, మనీష్‌ పాండే, రిషభ్‌ పంత్‌ (కీపర్‌), క్రునాల్‌ పాండ్యా, చాహల్‌, కుల్దీప్‌, భువనేశ్వర్‌, బుమ్రా, ఖలీల్‌ అహ్మద్‌,
వెస్టిండీస్‌: బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), ఫాబియన్‌ అలెన్‌, డారెన్‌ బ్రావో, హెట్‌మయెర్‌, కీమో పాల్‌, రామ్‌దిన్‌ (కీపర్‌), రూథర్‌ఫోర్డ్‌, ఓషెన్‌ థాంప్సన్‌, ఖారీ పీయరీ, మెక్‌కాయ్‌, రోవ్‌మన్‌ పొవెల్‌, నికొలాస్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తర్వాతి కథనం
Show comments